Share News

YS Sharmila: కేసీఆర్‌కు వైఎస్ షర్మిల వెరైటీ గిఫ్ట్.. బైబై కేసీఆర్ అంటూ..

ABN , First Publish Date - 2023-12-02T13:09:14+05:30 IST

Telangana Elections: తెలంగాణలో రేపు(ఆదివారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. గెలుపు తమదే అంటే తమదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్‌ కేసును గిఫ్ట్‌గా పంపించారు.

YS Sharmila: కేసీఆర్‌కు వైఎస్ షర్మిల వెరైటీ గిఫ్ట్.. బైబై కేసీఆర్ అంటూ..

హైదరాబాద్: తెలంగాణలో రేపు(ఆదివారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. గెలుపు తమదే అంటే తమదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి (YSRTP Chief YS Sharmila Reddy) వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్‌ కేసును గిఫ్ట్‌గా పంపించారు.


ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘బైబై కేసీఆర్..కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్ధుకునే టైం వచ్చింది. కేసీఆర్ గారు ప్యాక్ అప్ చేసుకోండి. బైబై కేసీఆర్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనకు ఎండ్ కాడ్ పడబోతుందన్నారు. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చిందని... ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో 71 మంది పదివేల మెజార్టీతో గెలిచారు. పదివేల మెజార్టీ అయినా కూడా ముఖ్యం కాబట్టి.. తాము పోటీ చేసి ఒకవేల 5,000 ఓట్లు చీల్చినా తేడా వస్తుందని.. కేసీఆర్‌ను ఓడించాలని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని అన్నారు. ఇన్నాళ్లు బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. కేసీఆర్ అవినీతి మీద బీజేపీ ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదని విమర్శించారు. వీళ్లిద్దరు తోడుదొంగలు అయి కలిసే ఉన్నారని ఆరోపించారు.

‘‘కేసీఆర్‌కు మించిన కరెప్ట్ పొలిటీషియన్ లేరని అమిత్ షా (Union Minister Amit Shah) చెప్పారు. ఆయన ఏ స్కీం లు చేసినా అవినీతే అని మోదీ (PM Modi) చెప్పారు... మీరు మీరు కలిసి లేకపోతే మేం ఎంక్వేరీ వేయాలని కోరినా ఒక్క యాక్షన్ కూడా ఎందుకు తీసుకోలేదు’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటి కాకపోతే ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకుండా ఉండాలన్నారు. దీన్ని రిఫరాండంగా తీసుకోవాలి తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొద్దని అన్నారు. 2014, 2018లో 45 మందిని కేసీఆర్ కొన్నారని.. కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేలు 40, ఎమ్మెల్సీ 4, ఎంపీ 1 రిని కొన్నారని తెలిపారు. ఇది మళ్లీ రిపీట్ కాకూడదని.. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి అధికారంలోకి వచ్చే విధంగా చేయకూడదని కేసీఆర్‌ను తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం మారాలని.. ఎవరు ముఖ్యమంత్రికావాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని వైఎస్ షర్మిలారెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-12-02T13:09:16+05:30 IST