విప్రచిత్తా క్రమంలో భద్రకాళి
ABN , First Publish Date - 2023-06-24T23:46:45+05:30 IST
వరంగల్ మహానగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి ఆలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి వేడుకలు శనివారంతో ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులతో ఇచ్చాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి విప్రచిత్తా నిత్యా గాను, సోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని మహావజ్రేశ్వరిగాను అలంక రించి పూజారాధనలు జరిపారు.

హనుమకొండ కల్చరల్, జూన్ 24: వరంగల్ మహానగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి ఆలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి వేడుకలు శనివారంతో ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసిన అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులతో ఇచ్చాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి విప్రచిత్తా నిత్యా గాను, సోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని మహావజ్రేశ్వరిగాను అలంక రించి పూజారాధనలు జరిపారు.
సాధకుడి సంకల్పాలను వజ్రసంకల్పంగా దృఢతరం చేసి మనిషి సాధనలో కృతకృత్తున్ని చేసి ఆత్మోద్ధరణ జరుపుతుం దని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు చెప్పారు. కుమారషష్టి సందర్భంగా అనేక మంది భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధనలో పాల్గొన్నారు.