Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Apr 06 , 2025 | 08:34 PM
గడిచిన రెండు, మూడు నెలల్లోనే నాగార్జున సాగన్ డ్యాం వద్ద పలుమార్లు అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అసలు నిప్పు ఎలా పుడుతుందనే విషయం అర్థం కావడం లేదని అంటున్నారు.

నల్గొండ: నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. ఎర్త్ డ్యాం వద్ద ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, డ్యాం అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఎర్త్ డ్యాంపై ఉన్న విద్యుత్ వైర్లు, సీసీ కెమెరాలు దగ్ధం అయ్యాయి.
మరోవైపు గడిచిన రెండు, మూడు నెలల్లోనే నాగార్జున సాగన్ డ్యాం వద్ద పలుమార్లు అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అసలు నిప్పు ఎలా పుడుతుందనే విషయం అర్థం కావడం లేదని అంటున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన డ్యాం వద్ద డీఫారెస్ట్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వ్యాపించి చెట్లు, మెుక్కలు దగ్ధమైయ్యాయి. ఫిబ్రవరి 21న మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. డీఫారెస్ట్ ఏరియాలో మంటలు చెలరేగి చెట్లు, మెుక్కలు కాలిపోయాయి.
మార్చి 19న సైతం ప్రధాన ఎర్త్ డ్యాం వద్ద మంటలు వ్యాపించాయి. అక్కడ్నుంచి శివుడి పార్క్ వరకూ చెట్లు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. అధికారుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం మాత్రం అధికారులకు అంతుచిక్కడం లేదు. మంటలు ఎందుకు వ్యాపిస్తున్నాయనే విషయం అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఆ రైతుల కోసం కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. అమెరికాతో చర్చలు జరపాలంటూ..
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్