HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
ABN , Publish Date - Apr 06 , 2025 | 08:40 PM
HCU Land: హెచ్‌సీయూ భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఆ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే పలు వీడియోలు సైతం ప్రజలను తప్పు పట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ మీడియా చైర్మన్ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 06: కంచ గచ్చిబౌలిలోని వందలాది భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అలాంటి వేళ.. ఈ భూములకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆటవీ ప్రాంతాన్ని వీడి.. ఓ జింక జనావాసాల్లోకి ప్రవేశించినట్లు దృశ్యాలు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఈ వీడియో వైరలవుతున్న నేపథ్యంలో టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్.. సామా రామ్మోహన్ రెడ్డి ఆదివారం సోషల్ మీడియాలోని తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
ఎప్పుడో 2020 సంవత్సరం ఉత్తరాఖండ్‌లో రోడ్డు మీద ప్రత్యక్షమైన జింకలను నేడు హైదరాబాద్ కంచ గచ్చిబౌలి వ్యవహారానికి అంటగట్టిన గుంట నక్కల కుట్రలు మరొక్క సారి బహిర్గతమైందన్నారు. డియర్ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ .. ప్రజలను పక్కదోవ పట్టించిన ఇలాంటి వీడియోలపైన నిజాన్ని చెప్పే దమ్ముందా?.. ఉంటే స్పందించండి.. మీ నిజాయితీని నిరూపించుకోండి. ఇప్పుడు తెలిసిపోతుంది.. చిల్లరకు పని చేసే వాడెవడో.. చైతన్యం చేసే వాడెవడో. అంటూ ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి ఆయన సూటిగా సవాల్ విసిరారు.
ఇక కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సదరు యూనివర్సిటీ విద్యార్థులు వ్యతిరేకించారు. ఆ క్రమంలో వారు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ వ్యవహారం కాస్తా రచ్చ రచ్చ అయింది. మరోవైపు ఈ భూముల వేలం వ్యవహారం నేపథ్యంలో అధికార పార్టీ నేతలపై ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ యా పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. అయితే 2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ భూములను అప్పటి ప్రభుత్వం ఐఏంజీకి కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేసింది. మరోవైపు ఈ భూములను ప్రభుత్వానికి కేటాయించడం.. మరో ప్రదేశంలోని భూములను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ విడుదల చేసింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దీనిని నిలుపుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఆదేశించింది. అంతేకాకుండా.. సదరు ప్రదేశంలోని చెట్లను సైతం నరకవద్దంటూ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఇక హెచ్‌సీయూ భూములు ఎవరు కొనుగోలు చేసినా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్వాధీనం చేసుకొంటామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకొన్న భూ కేటాయింపులను రేవంత్ సర్కార్ బయటకు తీసి పరిశీలిస్తోంది. అలాగే ఈ భూములకు సంబంధించిన పలు వీడియోలు, కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ ఫేక్ వీడియోల వైరల్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులోభాగంగా కేసులు నమోదు చేస్తోంది. ఏదీ ఏమైనా హెచ్‌సీయూ యూనివర్సిటీ భూముల విషయం తెలంగాణ రాజకీయాలను భారీ కుదుపులకు గురి చేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
For Telangana News And Telugu News