డబుల్ దందా
ABN , First Publish Date - 2023-03-06T01:04:41+05:30 IST
తొమ్మిదేళ్ల నిరుపేదల కల ఒక్క స్ర్కూట్నీతో చెల్లాచెదురైంది. గూడులే క, ఏళ్ల తరబడి గుడిసెలు, రేకుల ఇళ్లు, అద్దె ఇళ్లలో పదేళ్లకుపైగా ఉం టూ దరఖాస్తు చేసుకున్నా, జాబితాలో పేర్లు లేకపోవడం విస్మయానికి గురి చేసింది. నిరుపేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు... భూము లు, ఆస్తులు ఉన్న వారికి దక్కడంతో అర్హులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లిన అధికారులు
అర్హులకు దక్కని డబుల్ బెడ్‌రూం ఇళ్లు
లోపభూయిష్ఠమైన విధానాలు, అవకతవకల ఎంక్వయిరీ
భూములు, ఇల్లు ఉన్న వారికే మళ్లీ ఇళ్ల కేటాయింపు
ఆందోళనకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు, నిరుపేదలు
కలెక్టర్‌కు చేరిన తుది లబ్ధిదారుల జాబితా, నేడు వెల్లడి?
నల్లగొండ : తొమ్మిదేళ్ల నిరుపేదల కల ఒక్క స్ర్కూట్నీతో చెల్లాచెదురైంది. గూడులే క, ఏళ్ల తరబడి గుడిసెలు, రేకుల ఇళ్లు, అద్దె ఇళ్లలో పదేళ్లకుపైగా ఉం టూ దరఖాస్తు చేసుకున్నా, జాబితాలో పేర్లు లేకపోవడం విస్మయానికి గురి చేసింది. నిరుపేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు... భూము లు, ఆస్తులు ఉన్న వారికి దక్కడంతో అర్హులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇళ్ల పంపిణీకి శ్రీకా రం చుట్టినప్పటికీ లోపభూయిష్ఠ విధానాలు, ఎంక్వయిరీలో అవకతవక లు.. నిరుపేదలకు ఇల్లు దక్కకుండా చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి.
నల్లగొండ మునిసిపాలిటీలో వార్డుకు 11మందిని చొప్పున ఎంపిక చేస్తామని చెప్పి కొంత మందికి కేటాయించకుండా మరికొంత మందికి ఇళ్లు కేటాయించారు. ఆస్తులు ఉన్నవారిని ఎంక్వయిరీ సమయంలోనే తొలగించాల్సి ఉండగా విచారణ చేసిన సిబ్బంది లాలూచీ పడి, వారిని అర్హుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. డ్రా తీసిన సమయంలో పేర్లతో కూడిన చిట్టీలను కొన్ని పెద్దవిగా మరికొన్ని చిన్నవిగా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు శనివా రం తమకు న్యాయం చేయాలని కోరుతూ నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టగా బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీ వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం కూడా వివి ధ రాజకీయ పార్టీలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నా యి. వేలాదిమంది నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయం తీసుకుని హడావిడిగా లబ్ధిదారులను ఎంపిక చేయడంవల్లే ఈ సమస్య వచ్చింది. కనీస మార్గదర్శకాలు లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.
వేలాది మంది నిరుపేదలకు నిరాశ
నల్లగొండ పట్టణంలో 552 డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఉండగా మొత్తం 13,230 మంది దరఖాస్తు చేసుకున్నారు. పట్టణంలో సుమారు 2లక్షల మంది జనాభా ఉండగా, ఇందులో వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. అయితే పేద మధ్యతరగతి ప్రజలు పెద్దఎత్తున ఉండ గా అతి తక్కువ ఇళ్లను నిర్మించి నిరుపేదలకు తీవ్ర నిరాశ కల్పించార ని చెప్పవచ్చు. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై తొమ్మిదేళ్లుగా ఊరిస్తూ వచ్చి న ప్రభుత్వం తీరా ఉసూరుమనిపించింది. వేలాదిమంది నిరుపేదలు ఎన్నో కష్టాలు ఓర్చుతూ చాలిచాలని ఆదాయంతో ఇరు కు గదుల్లో నివసిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. చిన్నపాటి రేకుల ఇళ్లు, గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి ఇల్లు ఇవ్వకుండా పెద్దలకే ఇల్లు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్న తలెత్తుతుంది. 552 మందికి ఇల్లు దక్కితే మిగతా 3,653 మంది లబ్ధిదారులకు ఎప్పుడు ఇల్లు మంజూరవుతాయని ప్రశ్నిస్తున్నారు. పలు కాలనీల్లో కౌన్సిలర్లపై, ప్రజాప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నల్లగొండలో 3, 4, 20, 18వ వార్డులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికి చాలా మంది అసలు 552 మందికి లబ్ధిదారులను ఎంపిక చేశారా లేక కొన్ని ఇళ్ల డ్రాలను నిలిపివేశారా? అనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
దరఖాస్తుల స్ర్కూట్నీపై అనుమానాలు
పలువార్డుల్లో దరఖాస్తులు వచ్చిన వెంటనే హడావిడిగా విచారించారు. కొంతమంది పార్టీల నాయకుల జోక్యంతోపాటు కౌన్సిలర్లు కూడా కొంత మంది జోక్యం చేసుకుని తమకు అనుకూలమైన పేర్లను అర్హుల జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికైతే ఎఫ్‌ఎ్‌ససీ కార్డు కలిగి ఉండి, కిరాయి ఇల్లు అయి ఉండి వ్యవసాయ భూ మి లేని వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాలి. అయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డును మాత్రమే పరిశీలించి వారిని నిరుపేదలుగా చూపిస్తూ అర్హులుగా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇక 18వ వార్డులో జరిగిన డ్రాలో సొంత ఇల్లు, భూమి ఉన్న ఇద్దరిని ఎంపికచేశారు. మునుగోడు మండలంలో భూమి ఉన్న వారికి, నల్లగొండలో సొంత ఇల్లు ఉన్న వారిని ఎంపిక చేయడం ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్యకి ఇంటిని కేటాయించడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ వార్డులో ఈ ఇల్లు పొందిన లబ్ధిదారులు భూములతో పాటు, ఇల్లు కలిగి ఉండడం, ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండడం గమనార్హం.
కలెక్టర్‌కు చేరిన తుది నివేదిక.. నేడు ఫైనల్ ?
నల్లగొండలో డ్రాతీసిన అనంతరం డబుల్ బెడ్‌రూం ఇల్లు పొందిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి రెవెన్యూ అధికారులు అందజేశారు. అయితే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంతమంది అనర్హుల పేర్లను తొలగించారనే దానిపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది. సోమవారం కలెక్టర్ జాబితాను ఫైనల్ చేస్తారని సమాచారం. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు, ఇల్లు, పొలా లు ఉన్న వారిని గుర్తించినట్లు తెలుస్తుంది. శని, ఆదివారం రెండు రో జులపాటు రెవెన్యూ అధికారులు 552 మందికి సంబంధించిన లబ్ధిదారుల సమాచారాన్ని రీఎంక్వయిరీ చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఆదివారం రాత్రి కలెక్టర్‌కు రెవెన్యూ అధికారులు అందించారు. సోమవారం కలెక్టర్ తీసుకునే నిర్ణయం ఆధారంగా అర్హులు ఎంతమందో తేటతెల్లం కానుంది. ఈ విషయంపై నల్లగొండ ఆర్డీవో జయచంద్రారెడ్డిని వివరణ అడగగా రెండు రోజుల పాటు విచారణ చేయడం జరిగిందని, కలెక్టర్‌కు నివేదిక అందించామన్నారు.
లబ్ధిదారులకు దళారుల సమస్య
మిర్యాలగూడలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్య తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. మిర్యాలగూడలో పెద్దఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. అర్హులను స్ర్కూట్నీలో తొలగించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక దేవరకొండ పట్టణంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లక్కీడ్రాలో గెలుపొందిన డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులకు దళారులు సమస్యగా మారారు. మీకు ఇల్లు వచ్చినందున డబ్బులు ఇవ్వాలని, లేదంటే తిరిగి క్యాన్సల్ చేపిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేవరకొండలో 484డబుల్ బెడ్‌రూం ఇళ్లకు లక్కీడ్రాలో లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరిలో చాలామందికి ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నల్లగొండలో సైతం కొంత మంది రాజకీయ నాయకులు దళారీ అవతారం ఎత్తి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. డ్రాలో పేరు వస్తేనే ఇల్లు రాదని, తిరిగి మరోసారి ఎంక్వయిరీ ఉంటుందని బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
దేవరకొండలో కొనసాగుతున్న వివాదం
దేవరకొండ: దేవరకొండ మునిసిపాలిటీలో ఈ నెల 2న నిర్వహించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వివాదాలకు కేంద్ర బిందువైంది. మునిసిపాలిటీలో కొండభీమనపల్లి గ్రామస్థులకు 60 ఇళ్లు కేటాయించారు. మిగిలిన 484ఇళ్లను డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఆర్డీవో గోపిరాం ఆధ్వర్యంలో ఎంపికచేశారు. మునిసిపాలిటీలో 1725 మంది డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా 484 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి పేర్లు ప్రకటించారు. కాగా అన్ని అర్హతలున్న తమను ఎంపిక చేయలేదని బాధితులు ఈ నెల 3న దేవరకొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో గోపిరాం, డీఎస్పీ నాగేశ్వర్‌రావు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. అన్ని అర్హతలు ఉన్నవారికి న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ కౌన్సిలర్లు చెప్పినవారికే మంజూరయ్యాయని, అర్హులకు ఇవ్వలేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల అంజయ్యయాదవ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే డ్రాలో పేరు వచ్చిన లబ్ధిదారుల నుంచి రూ.5వేల నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
న్యాయం చేయాలి :ఇరగదిండ్ల విజయ, దివ్యాంగురాలు, 18వ వార్డు దేవరకొండ.
అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనిచేసుకొని బతుకుతున్నా, దివ్యాంగురాలిని. డబుల్‌బెడ్‌రూం ఇంటికి దరఖాస్తు చేస్తున్నప్పటికీ జాబితాలో నా పేరు లేదు. అధికారులు ఇల్లు మంజూరుచేసి న్యాయం చేయాలి.
దళారులకు ఒక్క పైసా ఇవ్వొద్దు : గోపిరాం, ఆర్డీవో, దేవరకొండ
డబుల్ బెడ్‌రూం ఇళ్లు డ్రా పద్ధతిలో న్యాయబద్దం గా ఎంపిక చేశాం. డ్రాలో పేర్లు రానివారు అర్హత ఉంటే న్యాయం జరిగేలా చూస్తాం. దళారులకు ఒక్క పైసా ఇవ్వొద్దు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరైనవారు ఎవరైన డబ్బులు అడిగి తే నాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటా.