Hyderabad: హర్ దిల్ ధ్యాన్, హల్ దిన్ ధ్యాన్
ABN , First Publish Date - 2023-02-15T21:52:58+05:30 IST
గరంలోని ఎల్బీ స్టేడియంలో ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో హర్ దిల్ ధ్యాన్, హల్ దిన్ ధ్యాన్ (ప్రతి హృదయంలోనూ ధ్యానం, ప్రతి రోజూ ధ్యానం) అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ రామచంద్ర మిషన్, కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో..
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో హర్ దిల్ ధ్యాన్, హల్ దిన్ ధ్యాన్ (ప్రతి హృదయంలోనూ ధ్యానం, ప్రతి రోజూ ధ్యానం) అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ రామచంద్ర మిషన్, కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా యోగాలోని పలు అంశాలైన ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానం తదితరాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తారు. ఈ కింద తెలిపిన తేదీలు, సమయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన వారంతా ఇందులో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఫిబ్రవరి 17న సాయంత్రం 5గంటల నుంచి 6.30 వరకు
ఫిబ్రవరి 18న ఉదయం 8గంటల నుంచి 9.30 వరకు
ఫిబ్రవరి 18న సాయంత్రం 5గంటల నుంచి 6.30 వరకు
ఫిబ్రవరి 19న ఉదయం 8గంటల నుంచి 9.30 వరకు