Balakrishna :తెలంగాణలో టీటీడీపీ పోటీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-04T21:20:49+05:30 IST
తెలంగాణ అభివృద్ధికి బీజం వేసింది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అని హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి బీజం వేసింది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అని హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం నాడు టీటీడీపీ కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ...‘‘దగ్గరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణ వాదంతో గతంలో ఒక ఎన్నిక జరిగింది. తెలంగాణ అభివృద్ది చంద్రబాబు హయాంలో జరిగింది. బీసీలు, ఎస్సీలకు తెలంగాణలో అన్యాయం జరుగుతోంది. ఎన్నికలు వస్తున్నాయనే బీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బానిస సంకెళ్ల నుంచి ఎన్టీఆర్ విముక్తిని కల్పించారు. ఏపీలో పరిస్థితి తెలంగాణలోనూ ఉంది.
చంద్రబాబు అరెస్ట్‌పై వాళ్లు స్పందించకపోతే పట్టించుకోం..
తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం కోసం కంకణం కట్టుకున్న. తెలంగాణ ఎన్నికల్లో పోరాడాలని నిశ్చయించుకున్నం. అందుకోసం ఒక స్టీరింగ్ కమిటీ వేసుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా నేను ఎన్నికల ప్రచారం చేస్తా. తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉందో చూపిస్తా. పొత్తులు చంద్రబాబు నిర్ణయిస్తారు. తెలంగాణలో పాలన మసి పూసి మారేడు కాయ అన్నట్లుగా ఉంది. ఐటీ ఎంప్లాయీస్ రాళ్లు వేసే వారు కాదు. వారు అల్లర్లు చేస్తారు అనేది అభూత కల్పన. సీఎం కేసీఆర్ కూడా టీడీపీలో ట్రైనింగ్ పొందిన వారే. రాజకీయ కక్షతో చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమ కేసుల్లో ఇరికించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను అందరూ ఖండిస్తున్నారు. అందరిలో ఆలోచన మొదలైంది. మేము కేసులకు అరెస్టులకు భయపడం. బీజేపీ అధ్యక్షురాలిగా మా అక్క పురంధరేశ్వరి ఉన్నారు. ఆమెతో నేను టచ్‌లో ఉన్నాను. బీజేపీ ఎందుకు స్పందించడం లేదో అవగాహన వచ్చాక స్పందిస్తాం. సినిమా వాళ్లు చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై స్పందించకపోతే పట్టించుకోం. ఎన్టీఆర్ స్పందించక పోవడంపై ఐ డోంట్ కేర్’’ అని బాలయ్య పేర్కొన్నారు.