Disha case: దిశ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ

ABN , First Publish Date - 2023-03-29T13:30:37+05:30 IST

దిశ ఎన్‌కౌంటర్‌‌కు సంబంధించి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Disha case: దిశ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ

హైదరాబాద్: దిశ ఎన్‌కౌంటర్‌‌ (Disha Encouter Case) కు సంబంధించి విచారణను హైకోర్టు (Telangana HighCourt) వాయిదా వేసింది. బుధవారం ఈ కేసులో కమిషన్ నివేదికఫై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ సాగింది. మొత్తం ఐదు ఇంప్లీడ్ పిటిషనర్లు హైకోర్టు తమ వాదనలు వినిపించారు. అప్పటి షాద్‌నగర్ సీఐ శ్రీధర్ (Shadnagar CI Sridhar), పోలీస్ ఆఫీసర్స్ సంఘం, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, దిశా కుటుంబం, తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. షాద్‌నగర్ సీఐ శ్రీధర్ తరుపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ రఘురాం (Supreme Court Senior Council Raghuram) వాదించారు. కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని రఘురాం తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై రెండో ఎఫ్ఐఆర్ అవసరం లేదని సీఐ శ్రీధర్ తరుపు న్యాయవాది అన్నారు. కమిషన్ రిపోర్ట్‌ను కేవలం ఒక్క ఆధారంగా చూడాలని.. రిపోర్ట్‌లో ఉన్నది ఉన్నట్టు ఆర్డర్ ఇవ్వాలని కాదన్నారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై రెండో ఎఫ్ఐఆర్ అవసరం లేదని చెప్పారు.

గతంలో సిట్ ఇచ్చిన రిపోర్ట్‌పై సెషన్స్ కోర్టులో విచారణ జరగాలని దిశా తరుపు న్యాయవాది కోర్టు తెలిపారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే అడ్వకేట్ జనరల్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ తరువాతి యిదాకు వస్తారని అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. అయితే పదేపదే వాయిదా కోరడంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్‌గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదుల మీద ఎందుకు ఆధారపడుతున్నారని ధర్మాసనం ప్రశ్నించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-03-29T13:30:37+05:30 IST