Minister Talasani: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2023-07-26T23:37:00+05:30 IST

భారీ వర్షాల(heavy rains) నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.

Minister Talasani: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

హైదరాబాద్(Hyderabad): భారీ వర్షాల(heavy rains) నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రావాలని సూచించారు.నగరంలో పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్‌తో మంత్రి తలసాని ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.నగరంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ రిజర్వాయర్‌(Hussainsagar Reservoir)కు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.


అన్ని స్థాయిల్లోని అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయాలని సూచించారు.రానున్న2, 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందన్నారు. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందించేందుకు సంసిద్ధంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Updated Date - 2023-07-27T04:15:08+05:30 IST