Share News

Bandla Ganesh: చంద్రబాబు కృతజ్ఞత సభలో కన్నీరు పెట్టుకున్న నిర్మాత బండ్ల గణేష్

ABN , First Publish Date - 2023-10-29T20:51:41+05:30 IST

హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ( Hi-Tech City Cyber ​​Towers Silver Jubilee Celebration ) ల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ( CBN Gratitude Concert ) ఏర్పాటు చేశారు.

Bandla Ganesh: చంద్రబాబు కృతజ్ఞత సభలో కన్నీరు పెట్టుకున్న నిర్మాత బండ్ల గణేష్

హైదరాబాద్: హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుక ( Hi-Tech City Cyber ​​Towers Silver Jubilee Celebration ) ల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ( CBN Gratitude Concert ) ఏర్పాటు చేశారు. నిర్మాత, నటులు బండ్ల గణేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపటి వరకు స్టేజీపై అలానే ఏడుస్తూ ఉండిపోయారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో నేను దసరా పండుగను జరుపు కోలేదు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకునేలా చంద్రబాబుకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. చంద్రబాబు కోసం మా ప్రాణాలు ఇస్తాం. సైబరాబాద్ లాగా... ఏపీలోని అమరావతి, గుంటూరు, రాజమండ్రిని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు అనుకున్నారు’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-29T21:50:10+05:30 IST