Jagityala: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్
ABN , First Publish Date - 2023-04-02T10:24:34+05:30 IST
జగిత్యాల: కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) జీవన్ రెడ్డి (Jeevan Reddy)కి బీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eswar) కౌంటర్ (Counter) ఇచ్చారు.
జగిత్యాల: కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) జీవన్ రెడ్డి (Jeevan Reddy)కి బీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eswar) కౌంటర్ (Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భూమిని చదును చేయడానికి వెళితే.. ప్రాజెక్టుకు శంకుస్థాపన అంటారా?.. దొంగచాటున చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రాజెక్టు కట్టకపోతే తనకు పోయేదేం లేదని, ఇథనాల్ (Ethanol)కు ఎవరి భూమి తీసుకోవడం లేదన్నారు. మీలా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు తాము చేయబోమన్నారు. ఈ విషయంలో తాను బహిరంగ చర్చకు సిద్ధమని.. జీవన్ రెడ్డి వస్తారా? అంటూ కొప్పుల ఈశ్వర్ సవాల్ చేశారు. అధికారులను, ఇథనాల్ నిర్వాహకులను తెస్తామని, తనకు సన్మానం చేయాల్సింది పోయి.. ప్రజలను రెచ్చగొడతారా? అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి అసలు అవగాహన ఉందా?.. కాలుష్యంపైన ప్రభుత్వానికి శ్రద్ధ ఉందన్నారు. జీవన్ రెడ్డి తీరువల్ల ధర్మపురి ప్రజలకే నష్టమని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
కాగా జగిత్యాల జిల్లా, వెల్గటూర్‌లో ఇథనాల్ ప్రాజెక్ట్ వద్దంటూ మూడు రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్‌కు చేతనైతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు. కాలుష్యం వెదజల్లే ఇథనాల్ పరిశ్రమ ఎందుకో చెప్పాలన్నారు. రూ. 750 కోట్ల ప్రాజెక్టుకు దొడ్డిదారిన ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదన్నారు. ధర్మపురి ప్రజల గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? ఎల్లంపల్లి నీళ్లు కాలుష్యం అయితే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. ధర్మపురి రైతుల పొట్టగొట్టి ఎవడి కడుపు నింపాలనుకుంటున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.