అన్నదాతకు ఉపయోగపడితేనే సార్థకత

ABN , First Publish Date - 2023-03-05T23:04:28+05:30 IST

విద్యార్థులు తమ విద్యలో నేర్చుకున్న అంశాలు అన్నదాతలకు ఉపయోగపడితేనే వ్యవసాయ విద్యకు సార్థకత ఏర్పడుతుందని, రాష్ట్రంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఇతర కళాశాలలన్నింటికి మార్గదర్శిగా మారిందని కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ అహ్మద్‌ హుస్సేన్‌ అన్నారు.

అన్నదాతకు ఉపయోగపడితేనే సార్థకత
మాట్లాడుతున్న అసోసియేట్‌ డీన్‌ అహ్మద్‌ హుస్సేన్‌

అశ్వారావుపేట రూరల్‌, మార్చి 5: విద్యార్థులు తమ విద్యలో నేర్చుకున్న అంశాలు అన్నదాతలకు ఉపయోగపడితేనే వ్యవసాయ విద్యకు సార్థకత ఏర్పడుతుందని, రాష్ట్రంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఇతర కళాశాలలన్నింటికి మార్గదర్శిగా మారిందని కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ అహ్మద్‌ హుస్సేన్‌ అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శనివారం రాత్రి ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగత వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో అసోసియేట్‌ డీన్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తమ ముందున్న లక్ష్యాలను నేరవేర్చుకోవాలని సూచించారు. మారుతున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను అవగాహన చేసుకుని ముందుకు సాగాలన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ఆచార్యులు వి.వెంకన్న, నాగాంజలి, గోపాలకృష్ణమూర్తి, మధుసూధన్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:04:28+05:30 IST