నేడు బీఆర్‌ఎస్ సభ సన్నాహక సమావేశం
ABN , First Publish Date - 2023-01-13T00:00:56+05:30 IST
ఈనెల 18న ఖమ్మంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభకు జనసమీకరణ చేసేందుకుగానూ సత్తుపల్లి నియోజకవర్గంలో సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.

సత్తుపల్లి, జనవరి 12: ఈనెల 18న ఖమ్మంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభకు జనసమీకరణ చేసేందుకుగానూ సత్తుపల్లి నియోజకవర్గంలో సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు సన్నాహక సమావేశంలో పాల్గోనున్నారు. సమావేశానికి ముఖ్య అతిఽధిగా రాష్ట్రమంత్రి తన్నీరు హరీష్‌రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు హాజరుకానున్నారు. సభ జరుగనున్న వేంసూరు రోడ్‌లోని కొత్తూరు ఉమామహేశ్వరరావు మామిడితోటలో ప్రాంగణాన్ని ఎమ్మెల్యే వెంకటవీరయ్య, సత్తుపల్లి మునిసిపల్ ఛైర్మన్ కూసంపూడి మహేష్‌లు గురువారం పరిశీలించారు.