Ponguleti Srinivas Reddy : ప్రజలను మభ్య పెట్టీ మూడోసారి సీఎం కావాలని కేసీఆర్ పగటి కలలు: పొంగులేటి
ABN , First Publish Date - 2023-04-09T23:34:38+05:30 IST
ప్రజలను మాటలతో మభ్య పెట్టీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్(KCR) కలలు కంటున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: ప్రజలను మాటలతో మభ్య పెట్టీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్(KCR) కలలు కంటున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు. ఆదివారం కొత్తగూడెం(Kothagudem)లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘కేసీఆర్.. మీ స్వార్ధం కోసం తెలంగాణ పేరు లేకుండా..మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలని బీఆర్ఎస్(BRS) పార్టీ పెట్టారు.ఇంటికో ఉద్యోగం ఏమైంది ధనిక రాష్ట్రం అని చెప్పి నాలుగు లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ ఏమైంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పలేదా..? దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాలు ఏమైంది...? నిరుద్యోగ భృతి ఎంత మందికి ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు మీ మంత్రులు వాళ్ల పీఏలు లీక్ చేస్తే మీ తోత్తులతో సిట్ వేయలేదా...? కేసీఅర్ మీ బిడ్డను రక్షించడానికి సుప్రీంకోర్టులో ఖరీదైన న్యాయవాదులను పెట్టుకున్నారు కానీ మైనార్టీ గిరిజన రిజర్వేషన్ బిల్లుపై న్యాయ పోరాటం ఎందుకు చేయడం లేదు.
సింగరేణి కార్మికులు బోర్డర్‌లో ఉండే సైనికులతో సమానమని గొప్పలు చెప్పిన కేసీఆర్ 123 మంది కార్మికులు చనిపోతే ఎందుకు పరామర్శించలేదు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్, చంద్రబాబు చనిపోయిన సింగరేణి కార్మికుల కుటుంబాలను పరామర్శించారు.లాభాల్లో ఉన్న సింగరేణినీ కేసీఆర్ అప్పులు పాలు చేశారు.24 వేల కోట్ల అప్పులు సింగరేణికి బకాయిలు ఉన్నాయి.కేసీఆర్ ఇబ్బంది పెట్టిన వ్యక్తులు శక్తులు ఏకం అయ్యే సందర్భం వచ్చింది... కేసీఆర్ మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.