Share News

IPL 2025, MI vs KKR: కోల్‌క‌తాకు కోలుకోలేని షాక్.. వికెట్లు ఎలా పడ్డాయో చూడండి

ABN , Publish Date - Mar 31 , 2025 | 08:04 PM

ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

IPL 2025, MI vs KKR: కోల్‌క‌తాకు కోలుకోలేని షాక్.. వికెట్లు ఎలా పడ్డాయో చూడండి
Trent Boult

వరుస పరాజయాలతో సతమమతమవుతున్న ముంబై ఇండియన్స్ స్వంత మైదానంలో ఆడుతున్న మ్యాచ్‌లో పై చేయి సాధిస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి (KKR vs MI). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ హార్దిక్ నమ్మకాన్ని నిలబెట్టిన ముంబై బౌలర్లు కోల్‌కతాను ఆదిలోనే దెబ్బతీశారు (IPL 2025).


ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లోనే సునీల్ నరైన్ (0)ను అద్బుతమైన యార్కర్‌తో అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీయడం బౌల్ట్‌కు ఇది 30వ సారి. ఆ తర్వాత రెండో ఓవర్లో కోల్‌‌కతాకు గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో 97 పరుగులు చేసి జట్టును గెలిపించిన డికాక్ (1)ను దీపక్ చాహర్ అవుట్ చేశాడు. ఇక, ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి జోరుమీదున్న కెప్టెన్ రహానేను కొత్త బౌలర్ అశ్విని కుమార్ అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న అశ్విని తొలి బంతికే రహానేను అవుట్ చేశాడు.


ఆ తర్వాత దీపక్ చాహర్ మరో బ్రేక్ ఇచ్చాడు. వెంకటేష్ అయ్యర్ (3)ను అవుట్ చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం రఘవంశీ (25), రింకూ సింగ్ క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. బౌల్ట్, అశ్విని ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ముంబై ఫీల్డర్లు ఇప్పటికే రెండు క్యాచ్‌లు వదిలేశారు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: కీలక సమయంలో ధోనీ అవుట్.. చెన్నై అభిమాని రియాక్షన్ చూస్తే


Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 09:01 PM