ప్రజల ముంగిటకే వైద్యం: ఎమ్మెల్సీ యాదవరెడ్డి

ABN , First Publish Date - 2023-04-27T23:43:18+05:30 IST

కొండపాక/అక్కన్నపేట/చిన్నకోడూరు/తొగుట, ఏప్రిల్‌ 27: ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వం ప్రజల ముంగిటకే వైద్యం తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి అన్నారు.

ప్రజల ముంగిటకే వైద్యం: ఎమ్మెల్సీ యాదవరెడ్డి
కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి

కొండపాక/అక్కన్నపేట/చిన్నకోడూరు/తొగుట, ఏప్రిల్‌ 27: ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వం ప్రజల ముంగిటకే వైద్యం తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి అన్నారు. గురువారం కుకునూరుపల్లి మండలం మాత్‌పల్లి గ్రామంలో సర్పంచ్‌ బచ్చలి మహిపాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుగుణ దుర్గయ్య, ఉపాధిహామీ స్టేట్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ కోల సద్గుణ, ఎంపీడీవో రాంరెడ్డి, ఏపీఎం శ్రీనివాస్‌, సెక్రటరీ ఆశ్రఫ్‌, మంగోల్‌ సర్పంచ్‌ కిరణ్‌ కుమార్‌చారి, వెంకటాపుర్‌ సర్పంచ్‌ స్వామి పాల్గొన్నారు. అలాగే కొండపాక మండలం దుద్దెడలో కంటివెలుగు కార్యక్రమాన్ని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆరేపల్లి మహదేవ్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నూనె కుమార్‌, ఉపసర్పంచ్‌ గుండెల్లి తదితరులు పాల్గొన్నారు. అక్కన్నపేట మండలం కేశవాపూర్‌ గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని జడ్పీటీసీ భూక్య మంగ గురువారం ప్రారంభించారు. ఇందులో సర్పంచ్‌ బొమ్మగాని రాజేశంగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు వైద్యులు పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని పీఏసీఎస్‌ చైర్మన్లు సదానందం, కనకరాజు సర్పంచ్‌ సంతోషితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీటీసీ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్‌ చిక్కుడు చంద్రం ముదిరాజ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొయురయ్య, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

Updated Date - 2023-04-27T23:43:18+05:30 IST