MLA: రాసిపెట్టుకోండి.. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆరే సీఎం...

ABN , First Publish Date - 2023-08-17T13:27:04+05:30 IST

కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌(MLA Lavudya Ramulanayake) ధీమా వ్యక్తం చేశారు.

MLA: రాసిపెట్టుకోండి.. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆరే సీఎం...

వైరా/కొణిజర్ల(ఖమ్మం): కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌(MLA Lavudya Ramulanayake) ధీమా వ్యక్తం చేశారు. కొణిజర్ల మండలంలోని గోపవరం, పెద్దరామాపురం, లక్ష్మీపురం గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన వారు బుధవారం వైరాలోని తమ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములునాయక్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌(BRS)లో చేరారు. బీఆర్‌ఎస్‌ కండువాలు వేసి ఎమ్మెల్యే సాదర స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, నాయకుడు పోట్ల శ్రీనివాసరావు, సర్పంచ్‌ అద్దంకి చిరంజీవి ప్రోత్సాహంతో వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేసీఆర్‌ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆదర్శనీయమన్నారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా, తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అందరూ సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు. కార్యక్రమాల్లో కొణిజర్ల మండలానికి చెందిన కిలారు మాధవరావు, చెరుకుమల్లి రవి, చల్లా మోహన్‌రావు, డేరంగుల బ్రహ్మం, చిన్నపుల్లయ్య, పోగుల శ్రీనివాసరావు, కృష్ణ, మాన్‌సింగ్‌, నర్సింహనాయక్‌, రంగా, నాగేశ్వరరావు, కాంతమ్మ, సత్యనారాయణ, సోందు, దేవేందర్‌, విజయకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-17T13:27:06+05:30 IST