Cotton Farmer : పత్తిరైతుపై విత్తన భారం
ABN , First Publish Date - 2023-04-05T02:43:26+05:30 IST
పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ షాకిచ్చింది. 2020-21 నుంచి వరుసగా పెంచుకుంటూ వస్తున్న పత్తి విత్తనాల ధరను మరోసారి పెంచింది.

విత్తనాల ప్యాకెట్ ధర రూ.43 పెంపు
ఇప్పటివరకు ఒక్కో ప్యాకెట్ రూ.810
రాష్ట్రంలో 1.40 కోట్ల ప్యాకెట్లు అవసరం
రైతులపై రూ.60 కోట్ల అదనపు భారం
విత్తనాల ప్యాకెట్ ధర రూ.43 పెంపు
ఇప్పటివరకు ఒక్కో ప్యాకెట్ రూ.810
రాష్ట్రంలో 1.40 కోట్ల ప్యాకెట్లు అవసరం
రైతులపై రూ.60 కోట్ల అదనపు భారం
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ షాకిచ్చింది. 2020-21 నుంచి వరుసగా పెంచుకుంటూ వస్తున్న పత్తి విత్తనాల ధరను మరోసారి పెంచింది. ఒక్కో ప్యాకెట్ ధరను రూ.43 చొప్పున పెంచింది. ఇప్పటి వరకు రూ.810 చొప్పున అందుబాటులో ఉన్న పత్తి విత్తనాల ప్యాకెట్ ఇక నుంచి రూ. 853కు లభించనుంది. 2023-24 సీజన్‌కు ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్ ధరను రూ.43 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చని వచ్చే సీజన్‌లో ఇది సుమారు 70 లక్షల ఎకరాలకు చేరుతుందని అధికారుల అంచనా. ఈ లెక్కన ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పు న రాష్ట్రంలో 1.40 కోట్ల పత్తి విత్తనప్యాకెట్లు అవసరం కానున్నాయి. విత్తనాల ధర పెంచడంతో రాష్ట్ర రైతులపై సుమారు రూ.60 కోట్ల మేర అదనపు భారం పడనుందని అంచనా.