వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తా

ABN , First Publish Date - 2023-07-09T23:35:52+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను గ్రామాల్లో పర్యటిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి మరోసారి పోటీ చేయడం ఖాయం అని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు.

వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తా
కేతిరెడ్డిపల్లిలో పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం

టికెట్‌ నాకే అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు : మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం

మొయినాబాద్‌, జూలై 9: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను గ్రామాల్లో పర్యటిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి మరోసారి పోటీ చేయడం ఖాయం అని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం అన్నారు. పల్లెపల్లెకు రత్నం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి, సజ్జన్‌పల్లి, అప్పారెడ్డిగూడ, షాపూర్‌, చాకలిగూడ తదితర గ్రామాల్లో రత్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమం పథకాలను అందిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ నుంచి తాను పోటీ చేయడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్‌ తనకే చేవెళ్ల టికెట్‌ అని ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన వెంట మోత్కుపల్లి సర్పంచ్‌ రత్నం, నాయకులు హన్మంత్‌రెడ్డి, భాస్కర్‌, మాధవరెడ్డి, శ్యామ్‌ సుందర్‌రెడ్డి, మోహన్‌గౌడ్‌, ప్రభాకర్‌, మహేందర్‌, మల్లేశ్‌, వెంకటేశ్‌, కుమార్‌, గ్రామాల యువకులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-07-09T23:35:52+05:30 IST