సాహిత్యలోకానికి కవయిత్రి మొల్ల ఆదర్శం
ABN , First Publish Date - 2023-03-13T23:20:56+05:30 IST
టి సాహిత్యలోకానికి కవయిత్రి మొల్ల ఆదర్శమని తాండూరు మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ దీపనర్సింహులు అన్నారు.

తాండూరు, మార్చి 13: నేటి సాహిత్యలోకానికి కవయిత్రి మొల్ల ఆదర్శమని తాండూరు మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ దీపనర్సింహులు అన్నారు. కవయిత్రి మొల్ల కళావేదిక ఆధ్వర్యంలో సోమవారం శిశుమందిర్‌లో నిర్వహించిన మొల్ల జయంతి వేడుకల్లో ఆమె ప్రసంగించారు. భావితరాలకు మొల్ల ఆదర్శమని అన్నారు. భవిష్యత్‌తరాల విద్యార్థులకు ఆమె చరిత్రపై వివరించాలని అన్నారు. మొల్ల కళావేదిక ఫౌండర్, అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ.. తెలుగులో రామాయణాన్ని రచించి శ్రీకృష్ణ దేవరాయలకు తన పద్యాల ద్వారా ఆలోచించే విధంగా రచనలు చేసిందని అన్నారు. తెలుగు భాషా పండితులకు, సాహిత్యప్రియులకు ఏటా సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రభుశంకర్, చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.