రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-07-18T23:52:57+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో రైతుల పంటల సాగుకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులను బ్లాక్‌మెయిల్, ద్రోహం చేస్తున్నారని కార్మికశాఖమంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు.

అమెరికాలో బిచ్చగాడిలా తిరుగుతూ ఎన్నికల కోసం పైసల్ వసూల్ చేస్తున్నాడు
దేశానికే అన్నం పెట్టే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆరే
కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
శామీర్‌పేట, జులై 18 : తెలంగాణ రాష్ట్రంలో రైతుల పంటల సాగుకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులను బ్లాక్‌మెయిల్, ద్రోహం చేస్తున్నారని కార్మికశాఖమంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలోని రైతువేదిక భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు సాగుచేస్తున్న పంటలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక రేవంత్‌రెడ్డి మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరసఫరా చేస్తే సరిపోతుందని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. రేవంత్‌రెడ్డి అమెరికాలో తిరుగుతూ ఎన్నికల కోసం బిచ్చగాడిలా పైసల్ వసూల్ చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. మాయమాటలు చెబుతూ రైతుల జోలికి వస్తే చీపుర్ దెబ్బలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఒరగబెట్టిందేమి లేదన్నారు.
రూ. 43 లక్షల సొంత నిధులతో అభివృద్ధి పనులకు హామీ
కాగా మంగళవారం శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలో మంత్రి మలారెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ గ్రామంలోని పలు కాలనీల్లో మంత్రి పాదయాత్ర చేశారు. గ్రామంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, యాదవ, ముదిరాజ్, ఎస్సీ బస్తీల్లో కొత్త కమ్యూనిటీ భవనాలు, మల్లన్నగుడి నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు రూ. 43 లక్షల సొంత నిధులను కేటాయిస్తున్న మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో పంచాయతీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మహిళలకు 30 కుట్టు మిషన్లను ఉచితంగా అందజేశారు.
నల్లపోచమ్మ ను దర్శించుకున్న మంత్రి
శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ గ్రామంలో సర్పంచ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లపోచమ్మ అమ్మవారు ఆలయాన్ని పునఃనిర్మించారు. మంగళవారం నల్లపోచమ్మ అమ్మవారు విగ్రహా ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదబ్రహ్మణు పండితుల మంత్రోశ్చరణలతో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి విచ్చేసి అమ్మవారును దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఎల్లుబాయి, జడ్పీటీసీ అనిత, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సుధర్శన్, వనజశ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ ఇందిరరాజిరెడ్డి, జడ్పీటీసీ అనిత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, సుదర్శన్ పాల్గొన్నారు.