గజగజ!
ABN , Publish Date - Dec 21 , 2023 | 10:48 PM
జిల్లాను చలి పులి వణికిస్తోంది. శీతల గాలుల ప్రభావంతో జిల్లా అంతటా జనాలు గజగజ వణుకుతున్నారు. గత వారం పదిహేను రోజులుగా జిల్లాలో వీస్తున్న చలిగా లులు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శీతల గాలుల కారణంగా జిల్లా జనజీవనంపై చలి పులి పం జా విసురుతోంది.

పంజా విసురుతున్న చలి పులి
జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
శీతల గాలుల ప్రభావంతో చిన్నారులు, వృద్ధుల అవస్థలు
తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
జనగామ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాను చలి పులి వణికిస్తోంది. శీతల గాలుల ప్రభావంతో జిల్లా అంతటా జనాలు గజగజ వణుకుతున్నారు. గత వారం పదిహేను రోజులుగా జిల్లాలో వీస్తున్న చలిగా లులు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శీతల గాలుల కారణంగా జిల్లా జనజీవనంపై చలి పులి పం జా విసురుతోంది. జిల్లా అంతటా వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్న డూ లేనంతగా ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నా యి. సాధారణ పరిస్థితికి భిన్నంగా శీతల గాలులు వీస్తున్నాయి. చలి గాలుల కారణంగా చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతలకు గురై ఆసుపత్రుల పాలవుతు న్నారు. జిల్లాలో వారం రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్టో గ్రత 10 డిగ్రీలకు పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఓవైపు చలి తీవ్రత పెరగడం, మరో వైపు కరోనా ముం చుకొ స్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల ని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప చలి తీవ్రత ఉన్న సమయంలో బయటకు రావొద్దని అంటు న్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించా లని హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవా రు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
10 డిగ్రీల కనిష్టానికి...
జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతు న్నాయి. వారం క్రితం వరకు సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండగా తాజాగా 10 డిగ్రీ సెంటిగ్రే డ్‌కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చలి గాలుల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా రాత్రితో పాటు పగటి ఉష్ణోగ్రతలు సైతం పడి పోతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా తగ్గిపో తూ తెల్లవారుజా మున 3 వరకు అత్యల్ప స్థాయికి పడిపోతున్నాయి. సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల ఉండాల్సి ఉండగా 26 నుంచి 30 డిగ్రీలకు తగ్గుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత మరీ తక్కువగా నమోదవు తోంది. ఈ వారంలో సగటు రాత్రి ఉష్ణోగత్ర 13 డిగ్రీలుగా నమోదవు తూ వస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రాం తాల్లో ఈ ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా నమోదవుతోంది. బుధవారం జిల్లాలో ని జఫర్‌ఘడ్ మండలం కూనూరు లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, గురువారం నాడు తరిగొప్పుల మండ లకేంద్రంలో అత్యల్పంగా 10.8 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. ఈ వారంలో సగటు ఉష్ణోగ్రత 13.6 డిగ్రీలుగా నమోదైంది. కాగా.. గత ఏడాది ఇదే సమయంలో సగటున కనిష్ట ఉష్ణోగ్ర త 16 డిగ్రీలుగా నమోదు అయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది దాదా పు 7 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
చిన్నారులు, వృద్ధులపై ప్రభావం
శీతల గాలులు చిన్నారులు, వృద్ధు లపై తీవ్ర ప్రభావం చూపుతున్నా యి. చలి గాలుల కారణంగా చిన్నా రులు, వృద్ధుల్లో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారుల్లో న్యూమోనియా వ్యాధి సోకుతోంది. ఉష్ణోగత్రలు తక్కువగా నమోదు అయిన సమయంలో శ్వాసకోశ సంబంధమైన న్యూమోనియా, ఆస్తమా వంటి వ్యాధుల ను కలుగజేసే వైరస్‌లు మరింత శక్తివంతగా మారుతా యి. మిగతా కాలాలతో పోలిస్తే మనుషుల రోగ నిరోధ క శక్తి కూడా చలికాలంలో చాలా తక్కువగా ఉంటుం ది. దీంతో వైరస్ శరీరంలోని సులువుగా ప్రవేశించి శ్వాసకోశ వ్యాధులను కలుగజేస్తుంది. ఈ వైరస్ ప్రభా వం ఎక్కువగా చిన్నారులు, వృద్ధులపై ఉంటుంది. వారం రోజులుగా వీస్తున్న చలి గాలుల ప్రభావంతో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ముందు జాగ్రత్త అవసరం
జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ముందస్తు జాగ్రతలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా చిన్నారులు, వృద్ధులను శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు చెబు తున్నారు కరోనా లక్షణాలు ఉన్నట్లు కనిపించగానే వెంటనే ఆస్పత్రులకు వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్ష లు చేయించుకోవాలని సూచిస్తున్నారు. చలికాలం లో కరోనా తొందరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున సాధారణ జలుబు, దగ్గు ఉన్నవారు సైతం భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నా రు. చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు, నాణ్యమైన రగ్గులను వాడడంతో పాటు వీలైన రూమ్ హీటర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెబు తున్నారు. రూమ్ హీటర్ల ద్వారా చాలా వరకు చలి నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు. నవజా త శిశువులను వీలైనంత వరకు తల్లి గుండెలకు హత్తు కొని (కంగారూ మదర్ కేర్ టైప్) ఉంచుకోవాలని చెబుతున్నారు.
చలితో న్యూమోనియాకు ఆస్కారం: డాక్టర్ డి. లింగమూర్తి, చిన్న పిల్లల వైద్య నిపుణులు, జనగామ
- చలి గాలుల కారణంగా చిన్నారుల్లో న్యూమోనియా సోకడానికి చాలా ఆస్కారం ఉంది. చిన్నారులను చలిలో తిప్పడం, తిరగనివ్వడం చేయకూడదు. చల్లటి పదార్థాలు కాకుండా వేడి వేడి పదార్థాలను పిల్లలకు పెట్టాలి. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారుల్ని ఎప్పుడూ వెచ్చగా ఉం చేలా చూడాలి. రూమ్ హీటర్లు ద్వారా చాలా వరకు చలిని కట్టడి చేయవచ్చు. నవజాత శిశువు ల్ని సాధ్యమైనంత వరకు తల్లి గుండెలతో హత్తుకొనే(కంగారూ, మదర్ కేర్ టైప్) ఉంచుకోవాలి. శీతల గాలుల కారణంగా చిన్నారుల్లో ఈ మధ్య న్యూమోనియా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నా యి. పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
నిర్లక్ష్యం చేయొద్దు: ఎస్. ప్రశాంత్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, జనగామ
- చలి తీవ్రతతో శరీరంలో మార్పులు వచ్చి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వృద్ధులకు చలి ఎక్కువ అయితే చెవుల్లోకి గాలి వెళ్లి మూతి వంకర్లు పోవడం, గుండెపోటు రావడం వంటి ప్రమాదం ఉంది. ఆస్తమా పెషెంట్లలో చలి వల్ల ఆయాసం పెరిగి ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. అందువల్ల తరచుగా గోరువెచ్చని నీటికి తాగడం, వేడి పదార్ధాలను మాత్రమే తింటూ ఉండాలి. కరోనా తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.