మంత్రి కేటీఆర్‌ సభకు భారీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-10-05T00:23:09+05:30 IST

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో గురువారం మంత్రి కేటీఆర్‌ సభను భారీ ఎత్తున నిర్వహిస్తామని ఎవె ్ముల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. బహిరంగ సభ జరిగే ఖిలావరంగల్‌లోని వాకింగ్‌ గ్రౌండ్‌ను కార్పొరేటర్లు, పోలీసు అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.

మంత్రి కేటీఆర్‌ సభకు భారీ ఏర్పాట్లు
ఖిలావరంగల్‌లోని వాకింగ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న కేటీఆర్‌ సభాస్థలి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

తూర్పు ఎవె ్ముల్యే నన్నపునేని

ఖిలావరంగల్‌లో సభా స్థలం సందర్శన

ఖిలావరంగల్‌, అక్టోబరు 4: వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో గురువారం మంత్రి కేటీఆర్‌ సభను భారీ ఎత్తున నిర్వహిస్తామని ఎవె ్ముల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. బహిరంగ సభ జరిగే ఖిలావరంగల్‌లోని వాకింగ్‌ గ్రౌండ్‌ను కార్పొరేటర్లు, పోలీసు అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ సభను ఖిలావరంగల్‌ వాకింగ్‌ గ్రౌండ్‌లో 60వేల మంది లబ్ధిదారులతో నిర్వహించనున్నామన్నారు. గురువారం హనుమకొండ, వరంగల్‌ జిల్లా కేంద్రాల్లో మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితబంధు, పెన్షన్స్‌, గృహలక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కుట్టుమిషన్లు, రైతులకు పంట నష్టపరిహారం చెక్కులు, ప్రభుత్వ పథకాల పంపిణీ ఉంటుందని చెప్పారు. బహిరంగ సభకు తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్లలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీపీ బారి, ఆర్డీవో వాసుచంద్ర, కార్పొరేటర్లు ఉమదామోదర్‌యాదవ్‌, దిడ్డి కుమారస్వామి, మరుపల్ల రవి, వస్కుల బాబు, చింతాకుల అనిల్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చింతాకుల సునిల్‌, ఎలుగం సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-05T00:23:09+05:30 IST