Share News

Amaravati : అందరికీ సాయం

ABN , Publish Date - Sep 07 , 2024 | 02:58 AM

విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది.

Amaravati : అందరికీ సాయం

  • వరద బాధితులకు సరుకుల పంపిణీ షురూ

  • రేషన్‌, ఆధార్‌ లేకున్నా ఓకే

  • ప్రతి కుటుంబానికీ ఉచితంగాబియ్యం సహా 6 రకాలు అందజేత

  • 1,100 వాహనాల్లో తరలింపు

  • బియ్యం, చక్కెర, కంది పప్పు, ఉల్లి,ఆలూ, పామాయిల్‌తో ప్రత్యేక కిట్లు

  • సంతృప్తి వ్యక్తంచేసిన చంద్రబాబు

  • నేడు మరింత ముమ్మరంగా పంపిణీ

  • రేషన్‌, ఆధార్‌ లేకున్నా ఓకే.. ప్రతి కుటుంబానికీ ఉచితంగా బియ్యం సహా 6 రకాలు అందజేత

అమరావతి/విజయవాడ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల ప్రజలకు ఆరు రోజులుగా సర్కారు నిరంతర సేవలు అందిస్తోంది. ఇక, ఇప్పుడు వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మొత్తం 16 డివిజన్లలోని ముంపు ప్రాంతాల్లో ఉన్న 70 వేలకుపైగా కుటుంబాలకు 6 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను ఉచితంగా అందిస్తోంది. పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 లారీల్లో ఈ సరుకులు శుక్రవారం ఉదయానికే విజయవాడకు చేరుకున్నాయి.

Untitled-8 copy.jpg

వీటిని డ్వాక్రా సంఘాల మహిళలు గొల్లపూడి మార్కెట్‌ యార్డులో ప్యాకింగ్‌ చేసి కిట్లుగా రూపొందించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, అఽధికారులు ఈ కిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి ఈ సరుకులు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో బాధితులకు చేరవేసేందుకు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలతోపాటు పొరుగున ఉన్న జిల్లాల నుంచి కూడా 1,100 ఎండీయూ వాహనాలను విజయవాడకు తరలించారు. లారీల్లో తీసుకువచ్చిన బియ్యం బస్తాలు, సరుకులతో కూడిన కిట్లను వీటిలో నింపారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఉన్న ఎండీయూ వాహనాలను శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌, ఎంపీ కేశినేని శివనాథ్‌లు ప్రారంభించారు. అనంతరం వాహనాలు వరద ముంపు ప్రాంతాలకు తరలి వెళ్లాయి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

  • వేలిముద్ర తీసుకుని

ప్రతినెలా రేషన్‌ కార్డుదారులకు సరకులు పంపిణీ చేస్తున్న తరహాలోనే ఇప్పుడు కూడా ఈ-పోస్‌ యంత్రాలలో వేలిముద్రలు వేయించుకుని ప్రభుత్వం ఉచితం సరుకుల కిట్లను పంపిణీ చేస్తోంది. రేషన్‌కార్డులు లేని బాధితులకు ఆధార్‌ కార్డులపై వీటిని అందజేస్తారు. రేషన్‌కార్డులు, ఆధార్‌ కార్డులు కూడా లేకపోయినా.. బాధితుల వివరాలు నమోదు చేసుకుని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, శనివారం పండుగ అయినప్పటికీ సరుకుల పంపిణీ కొనసాగనుంది.

  • ప్రతి కుటుంబానికీ అందిస్తాం: నాదెండ్ల

ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ‘‘వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ధైర్యం, భరోసా నింపేందుకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందచేసే కార్యక్రమం చేపట్టాం’’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో, ఉపముఖ్యమంత్రి పవ న్‌ కల్యాణ్‌ సూచనల మేరకు పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి బాధిత కుటుంబానికీ ఈ సరుకులు అందేలా అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

  • కిట్‌లో ఉండేవి ఇవే!

బియ్యం 25 కిలోలు

చక్కెర కిలో

కందిపప్పు కిలో

పామాయిల్‌ లీటరు

ఉల్లిపాయలు 2 కిలోలు

బంగాళా దుంపలు 2 కిలోలు

Updated Date - Sep 07 , 2024 | 02:58 AM