ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం కీలక సమావేశం

ABN, Publish Date - Jul 16 , 2024 | 04:44 PM

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరోసారి దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల (Telugu States) విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరోసారి దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

ప్రత్యేకించి షెడ్యూల్‌ 13లోని అంశాలపై 24న సమావేశంలో చర్చించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై తొలిసారిగా ఈ సమావేశం జరగునుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు.


ALSO Read: AP Cabinet Meet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయం

విభజన చట్టం షెడ్యూల్ 13లో రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అంశాలపై మాట్లాడనున్నారు. తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు , ఆంధ్రప్రదేశ్‌లోనూ కడప స్టీల్ ప్లాంటు, పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రేవంత్ రెడ్డి (Revanth Reddy) కలిసిన సందర్భంలో విభజన చట్టంలోని అంశాల అమలు గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. అటు రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: జోక్యం చేసుకోవద్దు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్

CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Ramprasadreddy: అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 04:58 PM

Advertising
Advertising
<