Share News

Central Ministers: ‘భోగాపురం పనులు’ పరిశీలన.. జగన్ ‘నిధులు’ దుర్వినియోగంపై విచారణ

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:57 PM

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు దృష్టి సారించారు. అందులోభాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పర్యవేక్షించారు. ఆ క్రమంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు.

Central Ministers: ‘భోగాపురం పనులు’ పరిశీలన.. జగన్ ‘నిధులు’ దుర్వినియోగంపై విచారణ
Central Minister K Rammohan Naidu

అమరావతి, జులై 09: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు దృష్టి సారించారు. అందులోభాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పర్యవేక్షించారు. ఆ క్రమంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అలాగే జాతీయ రహదారితో ఎయిర్‌పోర్ట్ కనెక్టవిటీ రోడ్డును సైతం ఆయన పరిశీలించారు. అదేవిధంగా విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన అంశాలను ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు జిల్లా కలెక్టర్ డా. బి ఆర్ అంబేద్కర్ వివరించారు.

Also Read: Indian student: న్యూయార్క్‌లో అవినాష్ గద్దె దుర్మరణం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటనలో విజయనగరం ఎం.పి. కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం నాగ మాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా ఉన్నతాధికారులతోపాటు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సైతం పాల్గొన్నారు.

Also Read: SIT's Report: హాత్రాస్‌ తొక్కిసలాటలో ‘కుట్ర కోణం’..!


Also Read: BMW hit-and-run case: మిహిర్ షా అరెస్ట్..

ఇక కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే.. వాటిని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగించిన నిధులకు ఖచ్చితమైన లెక్కలు అయితే లేవని మండిపడ్డారు.

Also Read: Congress Party: నెల రోజుల పాలనపై ఫైర్.. మోదీ‌కి సంధించిన ‘10 అంశాలు’

అయితే గత జగన్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌పై కేంద్ర మంత్రులకు మంచి నమ్మకముందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రుల హక్కు అయిన.. విశాఖ ఉక్కు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 09 , 2024 | 05:58 PM