AP Police: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున అరెస్ట్
ABN , Publish Date - Jul 22 , 2024 | 12:13 PM
Andhrapradesh: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధికార ప్రతనిధి నోటికొచ్చినట్లు మాట్లాడారు.
చిత్తూరు, జూలై 22: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను (YSRCP Spokesperson Nagarjuna Yadav) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై (Deputy CM Pawan Kalyan) వైసీపీ అధికార ప్రతనిధి నోటికొచ్చినట్లు మాట్లాడారు. అలాగే కొద్దిరోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Telangana CM Revanth Reddy) కూడా అవాచకులు చవాకులు పేలాడు.
CM Chandrababu: మినిట్ టు మినిట్ ఏం జరిగింది?.. మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు
సీఎం రేవంత్‌ను ‘‘వాడు వీడు’’ అంటూ డెలివరీ బాయ్స్‌తో పోల్చాడం వివాదాస్పదంగా మారింది. ఇంతటితో ఆగకుండా ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా నాగార్జునపై కుప్పం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన నాగార్జున... ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు ఈనెల 25 వరకు వైసీపీ నేతను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
YS Jagan: జగన్ ఇక మారరా? అసెంబ్లీ గేటు బయటా గొడవేనా?
అయితే... ఈ కేసు విచారణలో ఉండగానే బెంగళూరు నుంచి వస్తున్నారన్న సమాచారం మేరకు నాగార్జునను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత అరెస్ట్‌ను కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 25వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నాగార్జునను పోలీసులు అరెస్ట్ చేశారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైసీపీ నేతల కూడా నాగార్జున అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎలా అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి...
Gautam Gambhir: రోహిత్, కోహ్లీ 2027 ప్రపంచకప్ కూడా ఆడగలరు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్!
Raghurama Krishnaraju: హాయ్ జగన్ అంటూ దగ్గరకు వెళ్లి...
Read Latest AP News And Telugu News