Share News

కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల ధర్నా

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:07 AM

కలెక్టరేట్‌(కాకినాడ), నవంబరు 16(ఆంధ్రజ్యో తి): ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వ ర్యంలో అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చుతూ ఆదేశాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి కలె

కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల ధర్నా

మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండు

కలెక్టరేట్‌(కాకినాడ), నవంబరు 16(ఆంధ్రజ్యో తి): ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వ ర్యంలో అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చుతూ ఆదేశాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి కలెక్టర్‌ షాన్‌మోహన్‌కు శనివారం వినతిపత్రం అందజే శారు. ధర్నానుద్దేశిస్తూ సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు దువ్వ శేషబాబ్జి మాట్లాడుతూ 42 రోజుల రాష్ట్రవ్యాప్త సమ్మె ముగిసి నేటికి ఎనిమిది నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ఒప్పందం మేరకు ఏ ఒక్క డిమాండ్‌నూ నెర వేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర అప్పులను కార ణంగా చూపడం మానుకోవాలన్నారు. 300 కుటుంబాలకొక మినీసెంటర్‌ ఉండాల్సి ఉండగా, 1500 కుటుంబాలకు ఒక మినీ సెంటర్‌ నిర్వ హిస్తూ మినీ వర్కర్లను బానిసలకంటే దారు ణంగా పనిచేయిస్తున్నారన్నారు. మినీ వర్కర్లకు మెయిన్‌ వర్కర్లతో సమానంగా వేతనాలు, ప్ర మోషన్లు, వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. సుర పీంకోర్టు తీర్పును సైతం రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సమ్మె ఒప్పందం అమలుకు దశలవారీ పోరా టాలకు అంగన్వాడీలు సిద్ధపడాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అఽధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మ, చంద్రావతి, ఆశవర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, మధ్యాహ్న భోజన పథక కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:08 AM