అభివృద్ధిని విస్మరించిన డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Oct 07 , 2024 | 12:39 AM
పిఠాపురం, అక్టోబరు 6: రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసమే సనాతన ధర్మం అంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాలయాపన చేస్తున్నారని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. పిఠాపురంలో అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, రోడ్ల
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధు
పిఠాపురం, అక్టోబరు 6: రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసమే సనాతన ధర్మం అంటూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాలయాపన చేస్తున్నారని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. పిఠాపురంలో అధ్వానంగా ఉన్న పారిశుధ్యం, రోడ్లపై నిలిచిన మురుగునీరు ఉన్న ప్రాంతాలను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం యానాదుల కాలనీలో కె.అప్పలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. గెలిచి 3 నెలలు దాటిందని, ఒక్కసారి మాత్రమే నియోజకవర్గానికి వచ్చారని చెప్పారు. 3 నెలల్లో నియోజకవర్గంలో లేదా కాకినాడ జిల్లాలో ఒక అభివృద్ది పనికి శంఖుస్థాపనా జరిగిందా అని ఆయన ప్ర శ్నించారు. ఇసుక అందుబాటులో నిర్మాణాలు నిలిచిపోయి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందు లు పడుతున్నారని.. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సాకా రామకృష్ణ, లక్ష్మీనారాయణ పాదాలు, మేకల సుబ్బారావు, మర్రి లోవలక్ష్మి, రాంబాబు పాల్గొన్నారు.