పవన్ సుడిగాలి పర్యటన
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:46 AM
గొల్లప్రోలు/పిఠాపురం, నవంబరు 4(ఆంధ్ర జ్యోతి): గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోమవారం ప్రారంభించి అ నంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రూ.63.75లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబరు-2 శిలఫలకాన్ని ఆవిష్కరించారు. గొల్లప్రోలు జగనన్న కాల నీ ప్రజలకు వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ.4కో
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
దివ్యాంగులకు ఉపకరణాలు, బ్యాటరీ ట్రైసైకిల్స్ పంపిణీ
గొల్లప్రోలు/పిఠాపురం, నవంబరు 4(ఆంధ్ర జ్యోతి): గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోమవారం ప్రారంభించి అ నంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం రూ.63.75లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబరు-2 శిలఫలకాన్ని ఆవిష్కరించారు. గొల్లప్రోలు జగనన్న కాల నీ ప్రజలకు వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ.4కోట్ల వ్యయ ంతో సుద్దగడ్డ కాలువపై నిర్మించే బ్రిడ్జి నిర్మాణానికి, అర్ధంతరం నిలిచిన గొల్లప్రోలు అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి రూ.16లక్షలు, తహసీల్దారు కార్యాలయ భవన నిర్మాణానికి రూ.28.5 లక్షలతో చేపట్టే పనులకు, పట్టణ శివారు సూరంపేట ప్రజలకు వరదల సమయంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకు చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పూర్తికి రూ.24లక్షలతో చేపట్టే పనులకు, గొల్లప్రోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల తరగతి గదుల ఆధునికీకరణకు రూ.19లక్షలతో చేపట్టే పనులకు, మోగలి సూర్యుడు మంచినీటి చెరువు గ ట్టుపై వాకింగ్ ట్రాకింగ్ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
పిఠాపురంలో....
పిఠాపురంలో టీటీడీ కల్యాణ మండపం వేదికగా జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పవన్ పాలుపంచుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని వేంకటేశ్వరస్వామి ఆల యంలో రూ.20లక్షలతో మాడవీధుల నిర్మాణానికి, రూ.73లక్షలతో టీటీడీ కల్యాణ మండపం ఆధునికీకరణ, భోజనశాల నిర్మాణానికి. రూ.1.34 కోట్లతో పిఠాపురం పశువుల సంత ఆధునికీకరణ పనులకు రూ.23లక్షలతో బాలికక సమీకృత వసతి గృహసముదాయం మరమ్మతులు, రూ.10 లక్షలతో బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో క్రీడామైదానం అభివృద్ధికి, రూ.10లక్షలతో డిగ్రీ కళాశాలలో టాయిలెట్లు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.1.50కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ఆయన ప్రారంభించారు. శిలాఫలకాలు అన్నింటినీ టీటీడీ కల్యాణమండపం ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో కలెక్టరు సగిలి షాన్‌మోహన్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, జనసేన, బీజేపీ ఇన్‌చార్జిలు మర్రెడ్డి శ్రీనివాసరావు, బుర్రా కృష్ణంరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, జాయింట్ కలెక్టరు రాహుల్‌మీనా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పలువురు జిల్లా, డివిజన్, మండల, మన్సిపల్ స్థాయి అధికారులు, కూటమి నాయకులున్నారు.
గురుకుల పాఠశాలను సందర్శించిన పవన్
సర్పవరం జంక్షన్, నవంబరు 4 (ఆంధ్ర జ్యోతి): బాలికలు ఉన్నత విద్యాభ్యాసంతో పాటూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మొక్క లు పెంపకం, పర్యావరణం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత నవతరం ప్రతినిధులైన విద్యార్థులపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ పి.వెంకటాపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలయోగి బాలికల గురుకులం పాఠశాలను కలెక్టర్ సగిలి షాన్ మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో కలసి సందర్శించారు. బాలికలతో పవన్ ముచ్చటించి విద్యాబోధన, మౌలిక సదుపాయాలు, ఆ హార నాణ్యత, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ల్యాబ్‌ని సందర్శించి ఇంటర్మీడియెట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో మాట్లాడారు. ఎంసెట్ కోచింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే మహిళా డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని బాలికలు కోరారు. పాఠశాల భవనాలకు రిపేరు చేయాల్సి ఉందని సమస్యలను డీప్యూటీ సీఎంకు వివరించారు. గురుకులం పాఠశాల అభివృద్ధి కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పవన్ హామీ ఇచ్చారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని, పాఠశాల్లోనే ఎంసెట్ కోచింగ్ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఎంపీడీవో పసుపులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కూటమి నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, కరెడ్ల గోవిందు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, పెంకే సోమరాజు, శిరంగు శ్రీనివాసరావు తదితరులున్నారు.
కొత్తపల్లిలో శంకుస్థాపనలు
కొత్తపల్లి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మం డలంలో రూ.కోటి వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ సోమ వారం శంకుస్థాపనలు చేశారు. కొత్తపల్లి మండల ప్రాథమిక వైద్యఆరోగ్యకేంద్రంలో రూ.7.50లక్షలతో నిర్మించే అవుట్‌పేషెంట్ బ్లాక్, ఇసుకపల్లిలో రూ 16లక్షలతో నిర్మించే అదనపు గదులు నిర్మాణాలు, రవీంద్రపురంలో రూ.32 లక్షలు, కుతుకుడుమిల్లి శివారు నిదానందొడ్డి రూ.16లక్షలు, కొండెవరం శివారు శొంఠివారిపాకల్లో ప్రాథమిక పాఠశాల లకు రూ.16లక్షలతో అదనపు గదుల నిర్మాణాలు, మూలపేటలో బీసీ హాస్టల్ ఆధునికీకరణ నిమి త్తం రూ.4లక్షలతో నిర్మాణాల పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అమీనబాద్ సర్పంచ్ నక్కా మణికంఠ ఉప్పాడ-అమీనబాద్ తీరప్రాం తంలో నిర్మించే మినీహార్బర్ మొగలో బోట్లు ప్రమాదాలకు గురికాకుండా సముద్రంలో గతంలో నిర్మించిన గోడను మరో 200 మీటర్లు పెంచాలని వినతి సమర్పించారు. కేఎస్‌ఈజెడ్ ప్రాంతాలకు చెందిన రైతులు భూముల రిజిస్ట్రేషన్ చేయకపో వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీరాంపురం సర్పంచ్ రావి రమేష్ వినతి పత్రం సమర్పించారు. గోర్స సీతారామస్వామి ఆలయ భూములను కాపాడాలని గ్రామస్తులు పవన్ వాహనం ఎదురుగా ప్లకార్డులు ప్రదర్శించారు.
యువతి అదృశ్యంపై వినతి
తన మేనకోడలు వాకా లలిత (27) ఆగస్టు 3న ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి తిరిగిరాలేదని మండలంలోని అమరవల్లి సర్పంచ్ పులి జయ బాబు పవన్‌కు వినతి పత్రం సమర్పించారు. తొండంగి మండలం ఎల్లయ్యపేట సచివాలయం లో లలిత ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చే సేదని, ఆగస్టు 3న సచివాలయానికి వెళ్లి ఇంటికి రాకపోడంతో ఒంటిమామిడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 3నెలలు కావస్తున్నా నేటికి ఆచూకీ తెలియచేయలేదని వినతిలో పేర్కొన్నారు.