Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..
ABN , Publish Date - Nov 06 , 2024 | 10:16 AM
పిఠాపురంలో మహిళా అఘోరి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వచ్చింది. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
కాకినాడ జిల్లా: పిఠాపురం (Pithapuram)లో మహిళా అఘోరి (Female Aghori ) ప్రత్యక్షమవడం కలకలం (Kalakalam) రేపుతోంది. పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వచ్చింది. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులపాటు హల్‌చల్ చేసి, వివాదాస్పదంగా మారిన మహిళా అఘోరీ (నాగసాధువు).. సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. సోమవారం సాయంత్రం కారులో అన్నవరం నుంచి విశాఖవైపు వెళుతూ వేంపాడు టోల్‌ప్లాజా వద్ద ఆగింది. స్థానికులు, టోల్‌ప్లాజా సిబ్బంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో ఒక వ్యక్తి తనపై చేయి వేసి, తాకరాని చోట తాకాడంటూ ఆమె గొడవకు దిగింది. అతనెవరో తనకు తెలియాలని, సీసీ కెమెరా ఫుటేజీ కావాలని టోల్ ప్లాజా సిబ్బందిని డిమాండ్ చేసింది. తాను టోల్‌ఫీజు కోసమని కారు ఆపితే, ఆమె వాహనం నుంచి కిందకు దిగిందని, ఈ సమయంలో తాను చేతిని అడ్డుగాపెట్టానని, ఆమె కింద నుంచి వెళ్లే క్రమంలో చేయి తగిలి వుండవచ్చునని, ఉద్దేశపూర్వకంగా తాకలేదని టోల్‌ప్లాజా వద్ద వున్న ఒక వ్యక్తి వివరణ ఇచ్చాడు. ఒక వేళ తప్పయితే క్షమించాలని కోరాడు. ఈలోగా అక్కడకు చేరుకున్న సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ, ఏపీలో కూడా మహిళలకు రక్షణ లేదని, శివ సాన్నిధ్యంలో వుండే తనపట్లే అసభ్యంగా ప్రవర్తిస్తే, ఇక మహిళలకు రక్షణ ఎక్కడ వుంటుందని ఆమె ప్రశ్నించారు. తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నానని చెప్పుకొచ్చింది. సీఐ, ఎస్‌ఐలు నచ్చజెప్పడంతో ఆమె కారులో విశాఖవైపు వెళ్లిపోయారు.
మహిళ అఘోరీ. సోమవారం రాత్రి విశాఖకు చేరింది. నాగుల చవితి సందర్భంగా మంగళవారం ఉదయం జోడిగుడ్లపాలెంలోని నాగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది హిందుత్వాన్ని కాపాడడం, మహిళల రక్షణ, గో సంరక్షణ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని మనసులోని మాట బయటపెట్టింది. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని, ఏమీ కాదంది. ముఖ్యంగా ధర్మ పరిరక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబానికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. తాను పవన్‌ను కలవనని, ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని పేర్కొంది.