Share News

Minister Nimmala: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల..

ABN , Publish Date - Oct 26 , 2024 | 01:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

Minister Nimmala: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల..
Minister Nimmala Ramanaidu

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. నవంబర్ 6వ తేదీ లోగా ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులకు కీలక సూచనలు చేశారు.


ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.."ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 70 నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్డీయే అభ్యర్థులను గెలిపించేందుకు కూటమి శ్రేణులు కృషి చేయాలి. ప్రభుత్వం అందించే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ నేతలంతా కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. సాగునీటి సంఘాల ఎన్నికల్లోనూ మనదే విజయం కావాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో పని చేయాలి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చెమట చిందించాలి. ఏపీలో ఉచిత ఇసుక సరఫరా చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. పదకొండు బోట్స్‌మెన్ సొసైటీల్లో పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులోకి తీసుకువస్తాం.


ఉచిత ఇసుక పంపిణీలో స్థానిక నేతలేవరూ జోక్యం చేసుకోవద్దు. ఇసుక సరఫరాలో అక్రమాలకు పాల్పడే నేతలపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. విద్యుత్‌ను అధిక రేట్లకు కొనుగోలు చేసి ప్రజలపై భారం మెపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. వారి శ్రేయస్సు కోసం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేవలం రూ.100 కడితే రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకూ ప్రమాద బీమా అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సైతం విజయవంతం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మందితో సభ్యత్వం చేయించే దిశగా కష్టపడాలి" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి...

Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు

Viral Video: ఛీ.. ఛీ.. జెయింట్ వీల్‌ను కూడా వదలరా.. బహిరంగంగా యువతీయువకుల పాడు పనులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 01:32 PM