ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఆ నేతల్లో ఓటమి భయం.. వైసీపీలో ఆందోళన..

ABN, Publish Date - Apr 21 , 2024 | 05:27 PM

ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు.. అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది.

YSRCP

ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు.. అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది. జగన్ మేమంతా సిద్ధం యాత్రతో తమకు అనుకూల ఫలితాలు వస్తాయని వైసీపీ నేతలు భావించారు. జగన్ బస్సు యాత్ర పూర్తికావొచ్చింది. కానీ రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదట.


మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య విబేధాలు సమసిపోయి.. మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ కంటే కూటమి నేతలు ప్రచారంలో ముందున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో పాటు.. ఇటీవల రాయి ఘటన వైసీపీకి మైనస్‌గా మారిందనే చర్చ మొదలైంది. రాయి దాడిని కుట్రగా ప్రచారం చేసి.. దానిని విపక్షాలపై నెట్టి.. సానుభూతితో ఓట్లు పొందాలనే ఆలోచనతోనే ఆ ఘటనకు వైసీపీనే ప్లాన్ చేసిందనే ఓ రకమైన ప్రచారం గ్రామస్థాయిల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అసలు స్వరూపాన్ని ప్రజలు నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందట. ఏ నియోజకవర్గాల్లో ఈజీగా గెలవచ్చని వైసీపీ నేతలు లెక్కలు వేసుకున్నారో.. అక్కడే ఓడిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

AP Elections: వైసీపీలో విబేధాలు.. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి బాగా కలిసొచ్చే ఏకైక నియోజకవర్గం ఇదే..!!


ఆ జిల్లాపై ఫోకస్

తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించడంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాలో 19 నియోజకవర్గాలకు గానూ గత ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లలో గెలుపొందింది. దీంతో ఈసారి కూడా అదే స్థాయిలో సీట్లు గెలుపొందాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలతో కూటమి బలం మరింత పెరుగుతుంది. వారం క్రితం కనీసం 4 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావించిన నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం విజయవకాశాలు తగ్గాయనే ప్రచారం జరగుుతోంది. దీంతో జిల్లాలో నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట.


అక్కడా సీన్ రివర్స్..!

ప్రధానంగా మండపేట, రాజానగరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో గెలవచ్చని వైసీపీ భావించింది. క్రమంగా ఈ 3 నియోజకవర్గాల్లో పరిస్థితులు కూటమికి అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందువరకు మండపేటలో జనసేన క్యాడర్‌లో కొంతమంది వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం సాగింది. తాజాగా జనసేన ముఖ్య నాయకుల సమన్వయంతో ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అభ్యర్థికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాపు సామాజిక వర్గం ఓట్లలో మెజార్టీ ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పోటీచేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోటీ చేస్తుండగా.. కాపు సామాజిక వర్గం ఓట్లు రెండు పార్టీల మధ్య చీలే అవకాశం ఉందని అంతా భావించారు. ఈమధ్య పవన్ కళ్యాణ్ రాజానగరం నేతలతో మాట్లాడటం, అక్కడ ప్రచారానికి వెళ్లడంతో సీన్ పూర్తిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలోనూ జనసేన అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గన్నవరంలో వైసీపీ, జనసేన అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా ఉన్నప్పటికీ.. టీడీపీ పూర్తిస్థాయి మద్దతుతో జనసేన అభ్యర్థికి విజయవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందట.


Ramskrishna: వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2024 | 05:27 PM

Advertising
Advertising