AP Elections: సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!
ABN , Publish Date - May 09 , 2024 | 10:30 PM
ఎన్నికల ముందు వైసీపీ (YSR Congress) సోషల్ మీడియా టీమ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డికి ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది..
అమరావతి, ఆంధ్రజ్యోతి: వైసీపీ (YSR Congress) సోషల్ మీడియా టీమ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డిపై (Sajjala Bhargav Reddy) కేసు నమోదైంది. ఇటీవల టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుతో గురువారం నాడు ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. భార్గవరెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా టీమ్‌లను నిందితులుగా చేరుస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు పెన్షన్లను ఆపించారని.. కుట్రతో, విద్వేషాలు రగిల్చేలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ టీమ్ తప్పుడు ప్రచారం చేసిందని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఏంటి..?
భార్గవ్ ఆధ్వర్యంలో ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను, పింఛన్ లబ్దిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని క్లియర్ కట్‌గా ఫిర్యాదులో వర్ల పేర్కొన్నారు. అంతేకాదు.. పెన్షన్లను చంద్రబాబు ఇంటి వద్ద ఇవ్వాలని కోరారన్న విషయాన్ని కూడా ఫిర్యాదులో నిశితంగా వివరించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. వైసీపీ ఐవిఆర్ఎస్ కాల్స్‌పై సీఐడీ దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తాజాగా.. సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా సీఐడీ నుంచి ఎన్నికల కమిషన్ నివేదిక వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయన్నది తెలుస్తుంది.
Read Latest AP News And Telugu News