AP Elections2024: మాచర్లలో ప్లాన్ ప్రకారమే కుట్రకు తెరదీశారు.. ఏపీ డీజీపీకి దేవినేని ఉమ లేఖ
ABN, Publish Date - May 23 , 2024 | 08:34 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు ఎన్నికల రోజు, తర్వాత రోజు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా అందిస్తున్నామని లేఖలో తెలిపారు.
మాచర్ల మండలం రాయవరం గ్రామంలోని 51వ పోలింగ్ బూత్‌లో వైసీపీ గూండాలు టీడీపీ ఏజంట్లను బయటకు లాగి దాడి చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ రిగ్గింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు.
పోలీసులు ఉదాసీనత వైఖరి వల్లే దాడి జరిగిందని.. .బాధితులను రక్షించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామంలో టీడీపీ ఏజంట్ రేఖ్యానాయక్‌ను బూత్ నుంచి బయటకు బలవంతంగా లాక్కొచ్చి కొట్టి తీవ్రంగా గాయపరిచారన్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు బూత్ వద్ద రాళ్ల దాడికి పాల్పడ్డారని చెప్పారు.
నరసరావుపేట నియోజకవర్గంలో జీవనోపాధి కోసం పని చేసుకునే డీజే శివపై రాడ్లు, కర్రలతో దాడి చేసి వైసీపీ రౌడీలు చావబాదారని ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుగానే రచించుకున్న వ్యూహానికి కొందరు పోలీసులు దన్నుగా నిలిచారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, ఓటర్లపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..
నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..
టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..
ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..
నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 23 , 2024 | 09:28 PM