Share News

Ap Ellections 2024: మళ్లీ జగన్‌ వస్తే పీల్చేగాలిపైనా పన్నేస్తాడు బామ్మర్దీ

ABN , Publish Date - May 12 , 2024 | 04:55 AM

గోదారోళ్ల వెటకారమే వేరు. ఏదైనా ఉతికి ఆరేస్తారు. మాటలో మర్యాద తప్పరు. గురీ తప్పదు. ఎన్నికలప్రచారం రెండునెలలకుపైగానే రంజుగా సాగి చిన్నగా గూటికి చేరుకొంటోంది. దీంతో ఎన్నికలపైనా గోదావరి జిల్లాల్లో సెటైర్లు పేలుతున్నాయి.

Ap Ellections 2024: మళ్లీ జగన్‌ వస్తే  పీల్చేగాలిపైనా  పన్నేస్తాడు  బామ్మర్దీ

నిజమే బావ.. అప్పులు తేవడానికి ఏం మిగిలిందని?

గోదావరి బావా

బామ్మర్దుల సంవాదం

గోదారోళ్ల వెటకారమే వేరు. ఏదైనా ఉతికి ఆరేస్తారు. మాటలో మర్యాద తప్పరు. గురీ తప్పదు. ఎన్నికలప్రచారం రెండునెలలకుపైగానే రంజుగా సాగి చిన్నగా గూటికి చేరుకొంటోంది. దీంతో ఎన్నికలపైనా గోదావరి జిల్లాల్లో సెటైర్లు పేలుతున్నాయి. ‘జగన్‌ ఏదో చేశాను....చేశాను....అని చెబుతున్నాడు.. అసలు అంతకు ముందున్న నాయకులు ఎన్‌టీఆర్‌, చంద్రబాబు, జగన్‌ తండ్రి వైఎస్‌ ఏమీ చేయలేదా?.. నిద్రపోయారంటావా బావా?’ అంటూ మహావెటకారంగా కారం రాస్తున్నారు.

బావ : ఏంటి బామ్మర్ది.. ఎలచ్చన్లు మరీ దగ్గరకొచ్చేశాయ్‌. ఏంటీ కత..

బామ్మర్ది : బావ..ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈసారి ఆంధ్రాలో ఎలచ్చన్లు మా రంజుగా ఉన్నాయ్‌. నువ్వేమంటావ్‌ బావా.

బావ : అదే బామ్మర్దీ.. వైఎస్‌ కొడుకు జగన్‌ తెలుసు కదా... సంక్షేమ పఽథకాలు చూసి ఓటేసెయ్‌మంటున్నాడు.. మరి నాకు తెలీక అడుగుతా.. ఆనాడు మన ఎన్‌టీరామారావు పెట్టిన సంక్షేమ పఽథకాల కన్నా గొప్పవా ఈయన పెట్టిన పథకాలు? చంద్రబాబు చేసిన దానికన్నా గొప్పగా చేశాడా ఏంటి?

బామ్మర్ది : నువ్వన్నది నిజమే బావా.. నాకూ అలాగే అనిపిత్తాంది. అప్పుల మీద అప్పులు తెచ్చేసి.. మన నెత్తిన పెద్ద గుదిబండ ఎట్టేసి పథకాలు నడిపించేస్తున్నాడు. అన్నింటి మీద టాక్స్‌లనీ, అదనీ ఇదనీ ఎడాపెడా బాదేస్తున్నడు. మొన్న బట్టలు కొందామని వెళ్లా బావా, అక్కడ కూడా పన్నంట.. అదొక్కటేనా చెత్తకూ పన్ను అట.. మళ్లీ వచ్చాడనుకో గాలి పీల్చుకోవడానికి పన్ను అనేలా ఉన్నాడు బావోయ్‌.

ఎందుకంటే సంక్షేమం అంటున్నాడు. అభివృద్ధి గాల్లో కలిపేశాడు. మళ్లీ వచ్చాడనుకో, ఇక అంతే బావోయ్‌.. అప్పులు తేవడానికి ఏం మిగిలిందని? ఇక పీల్చే గాలిపై కూడా పన్ను వేసేస్తాడు..

బావ : పాయింట్‌కొచ్చావ్‌ బామ్మర్దీ. తాకట్టు పెట్టడానికి ఏమీ మిగల్చనప్పుడు, అప్పిచ్చే వాళ్లు మాత్రం ఏం చూసుకొని ఇస్తారంటావ్‌! అప్పుడు వీళ్లంటారు. మంచి చేస్తాం అప్పివ్వమంటే ఇవ్వట్లేదు.....సంక్షేమ పథకాలు మీకివ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు.. అందుకే పీల్చే గాలిపై పన్ను వేస్తున్నా అంటాడు బామ్మర్ది. నిజం బామ్మర్ది.

బామ్మర్ది : ఔను బావ. అప్పు ఇవ్వకపోతే పాపం వీళ్లు ఏం చేస్తార్లే అనేలా గుడ్డిగా నమ్మించేసి.. పేదోళ్ల సానుభూతి కొట్టేస్తారు బావా. అది కూడా నిజమే బావోయ్‌.. జగన్‌ అంతటోడే!


బావ : బామ్మర్దీ.. నిజమైన ప్రజానాయకుడైతే, రాష్ట్రాన్ని ఎలా ప్రగతి పథంలో నడిపించాలా..ఎలా అభివృద్ధి చేయాలా.... ఎలా పరిశ్రమలు తేవాలా... యువతకు ఎలా ఉద్యోగావకాశాలివ్వాలా....పేదోళ్లకు ఎలా ఉపాధి కల్పించాలనే వాటిమీద నిశితంగా ఆలోచిస్తాడు. బటన్‌ నొక్కేశా....బటన్‌ నొక్కేశా....అని పదే పదే బాకా ఊదేస్తుంటే వర్కవుట్‌ అయిపోతాదనుకుంటే ఎలా బామ్మర్ది. భ్రమ గానీ, మునుపట్లా కాదు బామ్మర్ది.

వాళ్లూ ఆలోచించగలుగుతున్నారు. వివేకంతో చూడగలుగుతున్నారు బామ్మర్ది. అన్నట్టు ఈ మధ్య అదే పేరుతో యూట్యూబ్‌లో సినిమా కూడా వచ్చినట్టుంది బామ్మర్ది. మరీ కళ్లకు కట్టినట్లుందని జనం చెప్పుకొంటున్నారని కర్ణాకర్ణిగా విన్నా. ఐనా.. మనకెందుకు బామ్మర్దీ ఇవన్నీను.

నోరు జారితే ఊరు జారుతుందంటారు. అసలే రోజులేం బాగాలేవు. మాటాడితే కేసంటున్నారు.. నువ్వు ఇలా పిచ్చిగా మాటాడితే నీ మీదా కేసు పెట్తేత్తారు..

బామ్మర్ది : మనకెందుకు అంటావేంటి బావా. తప్పుచేసినోడి గురించి పది మందికీ తెలియాలా వద్దా చెప్పు. ఇప్పుడూ మాట్లాడకపోతే ఇంకెప్పుడూ మాట్లాడలేం. ఎప్పుడూ ముందుకెళ్లలేవు. ఇప్పటికే చాలామంది చూస్సేరు బావా. అయినాసరే, ఆ వీడియోను అన్ని గ్రూపుల్లో పెట్టేస్తాను.

ఓటర్లు అందరూ చూసేలా చేసేస్తాను. ముఖ్యంగా పేదోళ్లందరూ చూసేవరకూ వదలను.బావా. ఇదే నా శపఽథం.

బావ : నీ పిచ్చిగానీ, వాళ్లు నమ్ముతారంటావా?

బామ్మర్ది : బావా...నువ్వేమీ డౌటు పడకు. ఇప్పుడు వాళ్లంతా చాలా వివేకంతో ఉన్నారు బావా. మన ఆంద్రోళ్లు చాలా మంచోళ్లు బావా.. గతం లో జగన్‌ అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు దోచేశాడని కేసులున్నా ఒక్క చాన్స్‌ అంటే ఓటేశారు బావా.. ఐదేళ్ల పాలన చూసి జనం విసిగిపోయారు. ఇప్పుడు ఓటేస్తే, ఇంకేమైనా ఉందా అంటున్నారు.. ఎందుకంటే జగన్‌ను డైరెక్టుగా చూసేశారు బావా..

బావ : నువ్వు అసాధ్యుడివి బామ్మర్దీ.. మనం ఎటు ఉండాలో కూడా భలేగా చెప్పావ్‌...

-రాజమహేంద్రవరం కల్చరల్‌

Updated Date - May 12 , 2024 | 05:03 AM