AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్! | Posani Krishnamurali Relative Yogendranath joins tdp VVNP
Share News

AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:22 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పోలింగ్‌కు ముందే కొందరు నేతలు, కార్యకర్తలు భవిష్యత్ కార్యాచారణ ప్రకటిస్తూ పార్టీలు మారిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది..

AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!

అమరావతి, ఏప్రిల్ 29: ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళికి పెద్ద షాక్ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్.. తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం నాడు అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

yogi.jpg

చేరిక ఎందుకంటే..?

అనంతరం యోగేంద్రనాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని అన్నారు. ఆయన ముందు చూపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. ఆయన ఆశయాలు నచ్చాయని అందుకే టీడీపీలో చేరినట్లు ఆయన వివరించారు. టీడీపీలో చేరిక తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. బ్రిటన్‌లో వ్యాపారవేత్తగా కొనసాగుతున్న యోగేంద్రనాథ్.. తన వ్యాపారాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నారు.

LokSabha Elections : లఖ్‌నవూలో నామినేషన్ వేసిన రాజ్‌నాథ్ సింగ్

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Bandi Sanjay: నువ్వొక డ్రామా ఆర్టిస్ట్.. నీ అయ్య లేకుంటే నీ బతుకేంది?

అయితే తెలుగుదేశం పార్టీపై విరుచుకు పడే వైసీపీ నేతల్లో పోసాని కృష్ణ మురళి ముందు వరుసలో ఉంటారు. జగన్ పాలనపై టీడీపీ నేతలు ఎవరైనా విమర్శలు చేస్తే.. ఆగమేఘాల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. వారిని ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది పోసాని కృష్ణమురళి సమీప బంధువుల్లోని వ్యక్తి టీడీపీలో చేరడంతోపాటు చంద్రబాబు విజన్‌తోపాటు.. ఆయన వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. మరి దీనిని పోసాని కృష్ణమురళి ఎలా తీసుకుంటారనే అంశంపై వైసీపీలో చర్చ అయితే సాగుతుంది.

Read National News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 04:10 PM