AP Election 2024: జగన్ పులి కాదు..పిల్లి.. షర్మిల సెటైర్లు
ABN, Publish Date - May 05 , 2024 | 06:10 PM
సీఎం జగన్ (CM Jagan) పులిలా గర్జించాడని.. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద చివరికి పిల్లిలా మారారని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల (YS Sharmila) సెటైర్లు గుప్పించారు. పదేళ్లలో పది పరిశ్రమలైనా ఏపీకి వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీకి పదేళ్ల కిందట ప్రత్యేక హోదా రావాలని.. కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
నెల్లూరు: సీఎం జగన్ (CM Jagan) పులిలా గర్జించాడని.. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద చివరికి పిల్లిలా మారారని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల (YS Sharmila) సెటైర్లు గుప్పించారు. పదేళ్లలో పది పరిశ్రమలైనా ఏపీకి వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీకి పదేళ్ల కిందట ప్రత్యేక హోదా రావాలని.. కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో ఆదివారం షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ, బీజేపీ పార్టీలపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన
పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని... ఇలా ఏదీ జగన్ సాధించలేకపోయారని ధ్వజమెత్తారు. మోదీ, జగన్ కలిసి మన చేతిలో చిప్ప, నెత్తిన టోపీ పెట్టారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిని భ్రమరావతి చేశారని విమర్శించారు. జగన్ మూడు రాజధానులని అన్నారని... ఏ ఒక్క రాజధానిని కూడా నిర్మించలేకపోయారని దుయ్యబట్టరు. ఇప్పటికే మన బిడ్డలు ఉద్యోగాల కోసం ఇతర రాష్డ్రాలకు పోతున్నారని... ఇలాగే కొనసాగితే యువతలేని రాష్ట్రంగా ఏపీ మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Sujana Choudary: వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని, ధరలు స్థిరీకరణ చేస్తానని మోదీ అన్నారని ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ అన్నారని... అయిదేళ్లలో ఒక్క జ్యాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 2,25,00 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వీటిని భర్తీ చేయకుండా ఇన్నాళ్లూ గుడ్డి గుర్రానికి జగన్ పళ్లుతోముతున్నారా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్రలేస్తారని. అయిదేళ్లు అయినా జగన్ ఇంకా నిద్రలేవలేదని ఆక్షేపించారు. మద్యపాన నిషేధం చేస్తానని జగన్ చెప్పారని.. కానీ .. డీఎస్పీ, ప్రెసిడెంట్ మెడల్, భూంభూం నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు.
నాసిరకం మద్యం తాగి 25శాతం అధికంగా అనారోగ్యాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దోపిడీ జరుగుతోందని.. భూకబ్జాలు, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియాలు దోచుకుంటున్నాయని విరుచుకుపడ్డారు. కనీసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా సరిగా లేదని ఫైర్ అయ్యారు. కంటైనర్లకు, కంటైనర్లు డ్రగ్స్ ఏపీలో దిగుతున్నాయని... వాటిని జగన్ ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
మతాల మధ్య చిచ్చుపెట్టాలని.. ఆ మంటలతో చలిగాచుకోవడమే బీజేపీ ధ్యేయమని.. అలాంటి పార్టీతో జగన్ కలిసి పనిచేశారని మండిపడ్డారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటీ పవన్ అని సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్ ఒక్కటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని స్పష్టం చేశారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ, పేదలకు ఇంటి ఖర్చులు ఇస్తామని తెలిపారు. ఏపీ బాగుపడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల కోరారు.
AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!
Read Latest Andhra pradesh News or Telugu News
Updated Date - May 05 , 2024 | 07:49 PM