బెనిఫిట్ షోలు రద్దు చేయడం సరికాదు: పల్లా
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:37 AM
పుష్ప-2 విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలను రద్దు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పుష్ప-2 విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలను రద్దు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖ ఆర్టీసీ డిపోలో ఐదు కొత్త బస్సులను రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. పుష్ప-2పై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో థియేటర్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. సినిమా హీరోలు కూడా కొత్త సినిమా విడుదల సందర్భంగా సమస్యలకు అవకాశం లేకుండా వ్యవహరించాలన్నారు. సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకురావాలన్న పవన్ అభిప్రాయానికి మద్దతు పలుకుతున్నానన్నారు.