Share News

Penugonda Lakshminarayana : సాంస్కృతిక పునర్వికాసం అవసరం

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:23 AM

సాంస్కృతిక పునర్జీవనం, పునర్వికాసం ప్రస్తుత సమాజంలో ఎంతైనా అవసరం ఉందని అరసం జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలిపారు.

 Penugonda Lakshminarayana : సాంస్కృతిక పునర్వికాసం అవసరం

  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ

గుంటూరు (కార్పొరేషన్‌), డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సాంస్కృతిక పునర్జీవనం, పునర్వికాసం ప్రస్తుత సమాజంలో ఎంతైనా అవసరం ఉందని అరసం జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ఆదివారం పెనుగొండ లక్ష్మీనారాయణకు అభినందన సభ జరిగింది. ఆయనకు శాలువా కప్పి, మెమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... కులాలు, మతాలు, అసమానతలు, విద్వేషాలు లేని సమాజాన్ని సాధించుకున్న రోజున గురజాడ, శ్రీశ్రీ, గుర్రం జాషువాల సాహిత్యం చదివే అవసరం ఉండదన్నారు. ప్రజలు పఠనాసక్తిని పెంచుకోవాలని సూచించారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సామ్యవాద, లౌకిక వాదాలకు తూట్లు పొడుస్తూ కాషాయీకరణ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సాహితీవేత్తలపై దాడులు చేస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Dec 23 , 2024 | 04:24 AM