ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Buddha Venkanna: వైసీపీలో ఆ నేతలను విడిచిపెట్టం.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:33 PM

వైసీపీ అధినేత జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.

విజయవాడ: ఆల్ ఇండియా పిరికిపందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష, కార్యదర్శులు అని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదవులు, డబ్బుల కోసం కక్కుర్తి పడే వ్యక్తులని విమర్శించారు. గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణమని ఆక్షేపించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని ఆరోపించారు.


వారు ఎక్కడ ఉన్నారు..

మాలాంటి ఎంతో మంది జగన్ అరాచకాలకు ఎదురొడ్డి నిబడ్డారని అన్నారు. వైసీపీ పాలనలో అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి నాని, వంశీలు నోటికొచ్చినట్లు వాగారని విమర్శలు చేశారు. నిజంగా మనిషి అనే వాడు ఎవడైనా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. వారి నోటిదూల చూసిన ప్రజలంతా చట్టప్రకారం శిక్షించాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అసలు కొడాలి నాని, వంశీ అడ్రెస్ ఏది. ఎక్కడ ఉన్నారని నిలదీశారు. చంపేస్తాం, పొడిచేస్తామని అన్న వారంతా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని బుద్దా వెంకన్న విమర్శించారు.


పారిపోయేతత్త్వం మాది కాదు..

‘‘మీలాగా అధికారం ఉంటే వాగటం, అధికారం పోతే పారిపోయే తత్త్వం మాది కాదు. సినీనటుడు పోసాని మురళీకృష్ణ అసలు మనిషిలా ఎప్పుడైనా మాట్లాడారా. మేము ఎప్పుడైనా భారతిరెడ్డి గురించి మాట్లాడామా. ఇప్పుడు ఏదో నంగనాచి కబుర్లు చెప్పినా.. ప్రజలే మిమ్మలను ఛీ కొడుతున్నారు. వంశీ, పోసాని, కొడాలి నాని , దేవినేని అవినాష్‌లు క్షమాపణకు అర్హులు కాదు. టీడీపీలో పోటీ చేసి ఓడిపోయి.. వైసీపీలో చేరగానే పార్టీ కార్యాలయంపై అవినాష్ దాడి చేయించాడు.చంద్రబాబు బిక్షతో ఎదిగారు.. మీరంతా బచ్చాగాళ్లు. పులిహోరలో పులి లాగా.. వీరంతా మాటల పులులే తప్ప.. దేనికీ పనికి రారు.పరిటాల రవికి సంబంధించిన ఆస్తులను వల్లభనేని వంశీ కొట్టేశాడు.పరిటాల శ్రీరామ్‌ను కోరుతున్నా.. మీ నాన్న ఆస్తులను వంశీ నుంచి తీసుకోండి’’ అని బుద్దా వెంకన్న కోరారు.


చట్టపరంగా శిక్షలు తప్పవు..

‘‘క్షమాణలు చెప్పినా, రాజకీయాలు నుంచి తప్పుకున్నాం అన్నా.. చట్టపరంగా శిక్షలు తప్పవు. అలాంటి వెధవలను టీడీపీలో చేర్చుకుంటాం అంటే.. నేనే ముందు వ్యతిరేకిస్తా. మొన్నటి వరకు విర్రవీగిన వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. నేను చెప్పిన ఈ వెధవలకు శిక్షలు పడితే.. ఇతరులకు గుణపాఠం అవుతుంది. సోషల్ మీడియాలో వారే అంతా సెట్ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు. జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేడు.రూ.1750 కోట్లు అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది. ఈ అవినీతిపై అమెరికాలో కేసు నమోదైంది.జగన్ అమెరికా వెళ్లే ముందే ఎయిర్ పోర్టులో చూసేందుకు వెళ్తాం. మళ్లీ జీవితంలో జగన్‌ను చూడలేం. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే’’ అని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - Nov 24 , 2024 | 12:34 PM