Share News

CM Chandrababu: హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jul 13 , 2024 | 09:27 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి సీఎం చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మంత్రులు సవితా, నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

CM Chandrababu: హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu Naidu

గుంటూరు, జూలై 13: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నేడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి సీఎం చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు సవితా (Savita), నారాయణ (Narayana), ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramnarayana Reddy), మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ (Former Chief Justice NV Ramana) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ మర్యాదలతో ఏపీ సీఎంకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. లోక కళ్యాణార్ధం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

Lavanya: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్య లేఖ


నేటి పర్యటన వివరాలు...

మరోవైపు ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతలను స్వీకరించనున్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు ఇటీవల టోల్ ఫ్రీ నెంబర్‌ను పల్లా శ్రీనివాసరావు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యాలయంలో సీఎం అందుబాటులో ఉండనున్నారు. అనంతరం ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు వివాహ వేడుకలకు చంద్రబాబు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్ళనున్నారు. రాత్రికి ముంబైలోనే బస చేసి.. ఆదివారం మధ్యాహ్నానికి సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి తిరిగి చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

YS Jagan: జగన్‌పై హత్యాయత్నం కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 09:41 AM