Share News

CM Chandrababu: సూపర్ 6తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు..

ABN , Publish Date - Oct 18 , 2024 | 07:21 AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల సమావేశం జరగనుంది. అనంతరం కొంతమంది ప్రజా ప్రతినిధులతో సీఎం ముఖాముఖి భేటీ కార్యక్రమం నిర్వహిస్తారు. సూపర్ 6 తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు.. సాండ్, లిక్కర్ పాలసీలపై వైసీపీ దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు తదితర అంశాలపై చర్చించనున్నారు.

CM Chandrababu: సూపర్ 6తో  రాష్ట్ర అభివృద్ధికి బాటలు..

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నేతృత్వంలో శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో (TDP Office) ప్రజా ప్రతినిధుల సమావేశం (Public Representatives Meeting) జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎనిమిది అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అనంతరం కొంతమంది ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీ కార్యక్రమం నిర్వహిస్తారు. సూపర్ 6 (Super 6)తో రాష్ట్ర అభివృద్ధికి బాటలు.. సాండ్, లిక్కర్ పాలసీలపై వైసీపీ దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు, సాగునీటి సంఘం ఎన్నికలకు సన్నాహాలు, టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్, పంచాయతీరాజ్‌కు పూర్వవైభవం , 125 రోజుల్లో కూటమి సాధించిన విజయాలు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.


కాగా టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభల్లో చెప్పిన విషయం తెలిసిందే. అలాగే తమ తమ నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి యేడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 నగదు ఇస్తారన్నారు. రైతుకు రూ.20 వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదు తదితర పథకాలను అమలు చేస్తుందన్నారు. రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే.


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్-6 పథకాలు.. మొదటిది ఆడబిడ్డ నిధి.. నెలకు రూ.1500, ఇద్దరు మహిళలు ఇంట్లో ఉంటే రూ.3 వేలు, ముగ్గురు ఉంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6,000 ఇస్తామని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. నేరుగా ఖాతాల్లో డబ్బులు వేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ డబ్బుతో మరింత డబ్బు ఎలా సంపాదించాలో కూడా నేర్పిస్తానని తెలిపారు.

రెండోది... తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే రూ.15 వేలు, ఇద్దరు బిడ్డలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు బిడ్డలు ఉంటే రూ.45 వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం అని చంద్రబాబు వెల్లడించారు. మూడోది... టీడీపీ అధికారంలోకి రాగానే ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. నాలుగోది... మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఐదోది... యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఆరో పథకం... రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, రైతులకు సబ్సీడీలు, పంట బీమా అందిస్తామని, పంటను కొంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ కార్యాలయంపై దాడి తప్పు కాదట

మూసీకి పునరుజ్జీవం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 18 , 2024 | 07:25 AM