Posani Bail Petition: పోసాని బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:48 PM
Posani Bail Petition: పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియగా తీర్పును గుంటూరు కోర్టు వాయిదా వేసింది. అయితే పోసానికి బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గుంటూరు జిల్లా, మార్చి 19: వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణ మురళి (Posni Krishna Murali) బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌పై (Minister Lokesh) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు జిల్లా జైల్లో పోసాని రిమాండ్‌లో ఉన్నారు. ఆయనపై ఏపీలోని పలు చోట్ల కూడా కేసులు నమోదు అయ్యాయి.
గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం కూడా దీనిపై విచారణ జరుగగా.. న్యాయస్థానం నేటికి వాయిదా వేసింది. ఈరోజు పోసాని బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. వాదనలు పూర్తి అయిన తర్వాత తీర్పును న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది. అయితే ఈనెల 23 వరకు ఆయనకు సీఐడీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 21కి బెయిల్ వస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది.
Marri Rajasekhar Resigns: మర్రి రాజశేఖర్‌కు బుజ్జగింపులు.. ఇదే ఫైనల్ అన్న ఎమ్మెల్సీ
ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకరోజు పాటు కస్టడీకి తీసుకుని పోసానిని సీఐడీ పోలీసులు విచారించారు. మరోసారి కూడా పోసానిని కస్టడీకి కోరేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కస్టడీ పిటషన్ వేసేలోపు బెయిల్ వస్తుందా లేక ఈలోపు ఎవరైన పీటీ వారెంట్‌లు వేసి మరోసారి ఆయనను రిమాండ్‌కు పంపిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది.
కాగా.. గత ప్రభుత్వ హయాంలో పోసాని హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యకర్త బండారు వంశీకృష్ణ గత ఏడాది అక్టోబర్‌లో సీఐడీకి ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 12న కర్నూలు జిల్లాలో ఉన్న పోసానిని పీటీ వారెంట్‌పై గుంటూరుకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపర్చడంతో ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు. అంతే కాకుండా పోసానిని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా.. ఒకరోజు పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఈ క్రమంలో నిన్న(మంగళవారం) పోసానిని గుంటూరు జిల్లా జైలు నుంచి అదుపులోకి తీసుకుని సీఐడీ కార్యాలయానికి తరలించి విచారించారు. సాక్షి మీడియా చెప్పడం వల్లే మీడియా సమావేశంలో మాట్లాడినట్లు పోసాని.. సీఐడీ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
Handriniva Canal Debate: హంద్రీనీవాపై వైసీపీ రచ్చ.. మంత్రి ధీటైన సమాధానం
Telangana Budget 2025-26: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి
Read Latest AP News And Telugu News