ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Home Minister Anitha ఆ కేసులను రీ ఓపెన్ చేస్తాం.. పోలీసులకు హోంమంత్రి అనిత వార్నింగ్

ABN, Publish Date - Jun 14 , 2024 | 06:12 PM

పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకు వస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు.చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు.

విజయవాడ: పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకు వస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు.చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కొంతమంది పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మార్పు లేకపోతే తామే మారుస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు, వారు స్వేచ్ఛగా తిరగవచ్చని అన్నారు. నేడు(శుక్రవారం) ఏబీఎన్‌తో మంత్రి అనిత మాట్లాడుతూ... మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీ ఓపెన్ చేస్తాం, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని హెచ్చరించారు.


సమీక్ష తప్పని సరిగా ఉంటుంది..

ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, గత ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అక్రమ కేసులు అన్నింటిపై కూడా సమీక్ష తప్పని సరిగా ఉంటుందని స్పష్టం చేశారు. చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా శాసనసభ వేదికగా కించపరిచారని మండిపడ్డారు. చంద్రబాబు ఈ సంఘటనతో కన్నీటి పర్యంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కన్నీటితో రాష్ట్రంలో రాజకీయంగా ఉప్పెన వచ్చిందన్నారు.


వారిని కూడా వెళ్లి కలుస్తా..

అందుకే ప్రజలు ఇలాంటి ఫలితాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలన రావాలని, శాంతిభద్రతలు బాగుండాలనే కోరుకునే ఆయనకు పట్టం కట్టారని అన్నారు. విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను, ఏ విధంగా హత్య చేశారో చూశామన్నారు. విశాఖలో వారి కుటుంబ సభ్యులను కూడా వెళ్లి కలుస్తానని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, మహిళలు, సామాన్య ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. తనకు కీలకమైన హోంశాఖ అప్పగించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నానని వంగలపూడి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

AP New Cabinet: ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్, లోకేష్‌కు ఏమిచ్చారంటే..?

NMD Farooq: అఘోరా అలా చెప్పాడు.. ఇలా ఫరూక్ మంత్రి అయ్యాడు!

Yanamala:ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలి

Payyavula Keshav: ఏపీలో ప్రతిపక్షం ఉండాలి.. పయ్యావుల ఆసక్తికర వ్యాఖ్యలు

For More AP News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 08:48 PM

Advertising
Advertising