భూ ఆక్రమణలపై సిట్‌తో దర్యాప్తు ..
ABN , Publish Date - Jul 11 , 2024 | 01:19 AM
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్లపాలనలో గురజాల నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై సిట్‌తో దర్యాప్తు చేయి స్తామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు

ఉచిత ఇసుక పాలసీతో కార్మికులకు జీవనోపాధి
రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే ఏకైక వ్యక్తి చంద్రబాబే
గురజాల ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల, జూలై 10: వైసీపీ ప్రభుత్వ ఐదేళ్లపాలనలో గురజాల నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై సిట్‌తో దర్యాప్తు చేయి స్తామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం పిడుగురాళ్ల ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఎన్నో జరిగా యని, రెవెన్యూ రికార్డులను మార్చేసి రుణాలు పొందిన వైనంపై సిట్‌తో దర్యాప్తు జరిస్తామని యరపతినేని అన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రే షన్ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడ్డారో గుర్తిస్తామన్నారు. టిడ్కో గృహాలు 80 శాతం టీడీపీ హయాంలోనే పూర్తిచేసినా ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏమీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, ఉచిత ఇసుక పాలసీతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకా శాలు లభించడం ఆయా కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నార న్నారు. సమావేశంలో యరపతినేని నిఖిల్, మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, పులుకూరి కాంతారావు, పాండురంగ శ్రీను, వడ్డవల్లి సర్వేశ్వరరావు, గండికోట వెంకటేశ్వర్లు, వున్నం వెంకట్రావు, ఎల్వీఆర్, జొన్నలగడ్డ శ్రీను, సయ్యద్ అమీర్‌అలి, కటకం అంకారావు, సైదా, శ్రీను, రమేష్, చిన్న, ఖాశింసైదా తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్ అరుణ్‌బాబును కోరిన ఎమ్మెల్యే యరపతినేని
గురజాల నియోజకవర్గ పరిధిలోని దైద, గుత్తికొండబిళం, కాట్ర పాడు, మోర్జంపాడు బుగ్గమల్లేశ్వరస్వామి దేవాలయాల ప్రాంతా లను పర్యాటక కేంద్రాలుగా గుర్తించాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్‌బాబుకు సూచించారు. బుధవారం పిడుగురాళ్లకు వచ్చిన కలెక్టర్ అరుణ్‌బాబు ఆర్‌అండ్‌బీ బంగ్లాలో యరపతినేనితో కలసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక కేంద్రాల స్థితిగతులను కలెక్టర్‌కు వివరించి, ఆయా ప్రాంతాలను సందర్శించాలని యరపతినేని కోరారు.