Andhra Pradesh: నరసరావుపేటలో ర్యాగింగ్ కలకలం.. వీడియోలు తీసి మరీ..
ABN , Publish Date - Jul 24 , 2024 | 04:25 PM
ర్యాగింగ్ భూతం ఎంతోమంది యువకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. విద్యాలయ ప్రాంగణాల్లో అంతా సమానమనే ఆలోచన చేయకుండా.. సీనియర్, జూనియర్ అంటూ వేధింపులకు పాల్పడటం కొన్నేళ్లుగా చూస్తున్నాం.
ర్యాగింగ్ భూతం ఎంతోమంది యువకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. విద్యాలయ ప్రాంగణాల్లో అంతా సమానమనే ఆలోచన చేయకుండా.. సీనియర్, జూనియర్ అంటూ వేధింపులకు పాల్పడటం కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఇటీవల ర్యాగింగ్ సంఘటనలు తగ్గాయని భావిస్తున్న క్రమంలో ఏపీలో ఐదు నెలల క్రితం జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది మహారాష్ట్రలోని థానేలో ఒక కళాశాలలో ఎన్‌సీసీ శిక్షణ పేరుతో కొందరు సీనియర్లు.. జూనియర్లను కర్రలతో కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఎన్‌సీసీ పేరుతో ర్యాగింగ్ చేస్తున్నారని.. ఇలా చేయడం నేరమంటూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఈఘటన మహారాష్ట్రలో తీవ్రకలకలం రేపడంతో ప్రభుత్వం స్పందించి.. నిందితులపై చర్యలు తీసుకుంది. సరిగ్గా ఏడాది తిరగకముందే అలాంటి ఘటన మరొకటి ఏపీలో చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో థానే లాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ర్యాగింగ్ చేసినట్లు తేలితే భవిష్యత్తు నాశనమవుతుందని తెలిసినా కొందరు విద్యార్థుల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. పోలీసులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థుల్లో అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పెద్దగా మార్పు కనిపించడంలేదు. కేవలం కొన్ని నిమిషాల సరదా కోసం ర్యాగింగ్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?
పల్నాడు జిల్లాలో..
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎన్‌సీసీ ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు అర్థరాత్రి సమయంలో విచక్షణ రహితంగా చితకబాదారు. వద్దని వారించినా వినకుండా కొడుతూనే ఉన్నారు. పదే పదే ఇలా చేస్తుండటంతో.. దెబ్బలు తట్టుకోక జూనియర్ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈఘటన వైరల్ అవుతోంది. ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులను విచారిస్తున్నారు. నరసరావుపేట వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి విద్యార్థులను విచారించి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. వాస్తవానికి ఈ ర్యాగింగ్ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండతో ఘటన వైరల్ అయింది. ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని.. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
BRS: ఇప్పటి వరకు ఆ చెక్కు బస్ భవన్‌కు చేరలేదు: హరీష్ రావు
అవగాహన కల్పించినా..
ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలంటూ కళాశాల ప్రారంభం సమయంలో ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఏర్పాటుచేస్తారు. అయినప్పటికీ కొందరు విద్యార్థుల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సీనియర్లు.. జూనియర్లు అనే బేధాబిప్రాయాలతో ర్యాగింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నట్లు తెలెలుస్తోంది. నరసరావుపేటలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడంతో.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గత ఏడాది ఆగష్టులో థానేలోని విద్యా ప్రసారక్ మండల్‌లోని జోషి-బెడేకర్ కాలేజీలో ఎన్‌సీసీ శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులను వారి సీనియర్లు కొట్టారని ఆరోపిస్తూ ఓ విడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బురదలో ఆరుగురు విద్యార్థులు బొర్లాపడుకుని ఉండగా.. వారిపై వెనుక నుంచి కర్రలతో కొట్టడం తీవ్ర కలకలం రేపింది. అలాంటి ఘటనే ప్రస్తుతం నరసరావుపేటలో జరిగినట్లు తెలుస్తోంది.
TS News: తమను వెదకొద్దంటూ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News