Viral Funny Video: ఓర్నీ.. హోమ్ డెలివరీ అంటే ఇదేనా.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:31 PM
కొందరు మహిళలు మాత్రం పూర్తిగా నేర్చుకోకుండానే బైక్ డ్రైవింగ్ మొదలుపెట్టి పలు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారు నవ్వకుండా ఉండలేరు.

ఇటీవలి కాలంలో చాలా మంది మహిళలు కూడా బైక్‌లు, కార్‌లు నడుపుతున్నారు. పురుషులతో సమానంగా రోడ్లపై బైక్‌లను పరుగులెత్తిస్తున్నారు. అయితే కొందరు మహిళలు మాత్రం పూర్తిగా నేర్చుకోకుండానే బైక్ డ్రైవింగ్ (Bike Driving) మొదలుపెట్టి పలు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారు నవ్వకుండా ఉండలేరు (Funny Video).
love.connection అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక అమ్మాయి స్కూటర్‌పై ఎక్కడికో వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న రోడ్డు మీద మలుపు వచ్చింది. అయినా ఆ అమ్మాయి తన బైక్ స్పీడ్ తగ్గించలేదు. పైగా స్కూటీకి బ్రేకులు వేయకుండా కాలితో ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమె తిన్నగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లిపోయింది. తలుపు ఢీకొట్టి లోపలికి స్కూటీతో సహా వెళ్లిపోయింది. ఆ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అక్కకు బ్రేక్‌లు ఎక్కడుంటాయో తెలియదేమో అని ఒకరు కామెంట్ చేశారు. అక్క హోమ్ డెలివరీ చేసిందని మరొకరు పేర్కొన్నారు. ఇల్లు రోడ్డు మధ్యలో ఎందుకు ఉంది అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Puzzle: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ కుందేళ్ల మధ్యలో క్యారెట్ ఎక్కడుందో చెప్పండి
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..
IQ Puzzle: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ట్యాంకుల్లో ముందుగా ఏది నిండుతుందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..