Share News

CM Chandrababu Directives to Police: బెట్టింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్.. నూతన చట్టానికి ప్లాన్..

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:09 AM

తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటా రద్దు చేసినా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయినప్పటికీ, సీట్ల కేటాయింపుపై స్పష్టత లేదు. కోటా అంశం కోర్టులో నిలవదని భావిస్తూ ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తోంది.

 CM Chandrababu Directives to Police: బెట్టింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్.. నూతన చట్టానికి ప్లాన్..
CM Chandrababu Naidu

ప్రత్యేక చట్టం తెస్తాం: సీఎం

నేరాలను అదుపులో ఉంచాలి

ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి రాకూడదు

ఇతర నేరాలు తగ్గినా ఆర్థిక మోసాలు పెరిగాయి

గంజాయి సాగు తగ్గింది.. వినియోగం ఇంకా తగ్గాలి

నేరగాళ్ల తెలివికి వివేకా హత్య కేసు ఓ ఉదాహరణ

టెక్నాలజీని వాడుకోండి పోలీసులకు సీఎం సూచన

అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): నేరాలను అదుపులో ఉంచాలని, లేదంటే ప్రభుత్వ విశ్వసనీయతను అందరూ ప్రశ్నిస్తారని, ఆ పరిస్థితి రాకూడదని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ‘రాష్ట్రంలో ఇతర నేరాలు తగ్గాయి. కానీ ఆర్థిక నేరాలు పెరిగాయి. గంజాయి సాగు బాగా తగ్గింది. వినియోగం ఇంకా తగ్గించాలి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొద్దాం. అది గ్యాంబ్లింగ్‌ను సైతం అరికట్టేలా ఉంటుంది. నేరస్థులు చాలా తెలివిగా సాక్ష్యాలు దొరక్కుండా మాయం చేస్తారు. పారిపోయే వారు కొందరైతే, పక్కవారిపై నేరాన్ని తోసేవారు మరికొందరు. వివేకానందరెడ్డి హత్య కేసు అందుకు ఉదాహరణ. ఐవోలు అప్రమత్తంగా ఉంటూ ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేరాలు తగ్గించేందుకు వీలైనంత ఎక్కువగా అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవాలి. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం తీసుకోవాలి’ అని ఆదేశించారు.


17 శాతం నేరాలు తగ్గుముఖం: డీజీపీ

రాష్ట్రంలో నేరాల తగ్గుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా వెల్లడించారు. సదస్సులో ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘‘గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరికి అంతకు ముందు ఏడాదితో పోల్చితే 17ు నేరాలు తగ్గుముఖం పట్టాయి. 75,500 సీసీటీవీలు ఏర్పాటు చేసి 187 డ్రోన్లతో పెట్రోలింగ్‌ చేస్తున్నాం. 2023 జూన్‌ నుంచి 2024 జనవరి వరకూ మహిళలపై 18,114 నేరాలు జరిగితే 2024 జూన్‌ నుంచి 2025 జనవరి వరకూ 16,809 నేరాలు నమోదయ్యాయి. శక్తి యాప్‌ ద్వారా 164 బృందాలతో నిరంతరం రక్షణ కల్పిస్తున్నాం. గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించ గలిగాం. గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న 2,911 మందిని అరెస్టు చేశాం’’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీజీపీపై సీఎం ప్రశంసలు కురిపించారు. ‘నేరాల నియంత్రణ, పరిశోధన, ప్రజలకు భరోసా.. లక్ష్యంతో ఏపీ పోలీసులు పని చేయాలి. మీ ‘లాఠీ టూ డేటా’ను మరింత ముందుకు తీసుకెళ్లండి’ అని అన్నారు. శాంతి భద్రతలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేయడంపై ఐపీఎస్‌ అధికారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 07:37 AM