Ambedkar statue: అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసింది వైసీపీ నేతే
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:08 AM
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో అంబేడ్కర్, ఎన్‌టీఆర్ విగ్రహాలకు చెప్పుల దండ వేసిన వ్యక్తి వైసీపీ నాయకుడేనని పోలీసులు గుర్తించారు. సిగ్నల్ ఆధారంగా నిర్ధారించిన తర్వాత మంగళవారం ఆయనను అరెస్టు చేశారు.

సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తింపు... అరెస్టు
నల్లజర్ల, మార్చి 25: అంబేడ్కర్, ఎన్‌టీఆర్ విగ్రహాలకు చెప్పుల దండ వేసింది వైసీపీ నాయకుడేనని పోలీసులు నిర్ధారించారు. మంగళవారం ఆయన్ను అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో ఉన్న అంబేడ్కర్, ముసుళ్లకుంటలోని ఎన్‌టీఆర్ విగ్రహాలకు గత శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. పుల్లలపాడు గ్రామం మాల సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకుడు బురుపుల బాబ్జీ రెండు విగ్రహాలకూ చెప్పుల దండ వేసినట్టు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ